చోరీకి గురైన కారు.. దొంగ ఎవరో తెలుసా?

Updated:13/04/2018 02:37 AM

car has lost know who is the theif

కారు పార్క్‌ చేసి షాపింగ్‌కు వెళ్లాడో వ్యక్తి. తిరిగొచ్చి చూస్తే పార్కింగ్‌లో ఉండాల్సిన కారు కనబడలేదు. ‘బాబోయ్‌ నా కారు ఎత్తుకెళ్లారు’ అనుకుంటూ పోలీసులకు ఫోన్‌ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు శోధించి ఎట్టకేలకు దొంగను పట్టుకున్నారు. మరి ఇంతకీ దొంగ ఎవరో తెలుసా? గాలి. ఏంటీ.. గాలి కారును ఎత్తుకెళ్లిందా? అని ఆశ్చర్యపోతున్నారు కదా! అసలు విషయం ఏంటంటే..

చైనాలోని క్వింగ్డావో ప్రాంతానికి చెందిన హుయాంగ్‌ అనే వ్యక్తి ఇటీవల ఓ పని నిమిత్తం దగ్గర్లోని దుకాణానికి వెళ్లాడు. తన కారును పార్కింగ్‌ స్థలంలో ఉంచి షాపు లోపలికి వెళ్లాడు. పని పూర్తి చేసుకుని అరగంట తర్వాత బయటకు వచ్చాడు. తీరా పార్కింగ్‌ దగ్గరకు వెళ్తే అక్కడ తన కారు కన్పించలేదు. దీంతో కంగారు పడిపోయిన హుయాంగ్‌ వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. తన కారును ఎవరో చోరీ చేశారని, అందులో 5000 యువాన్ల నగదు కూడా ఉందని వివరించాడు.

రంగంలోకి దిగిన పోలీసులు పార్కింగ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. వీడియో చూసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే ఈ కేసులో దొంగ మరెవరో కాదు గాలి. షాపింగ్‌కు వెళ్లే ముందు కారును పార్కింగ్‌లో నిలిపిన హువాంగ్‌ పార్కింగ్‌ బ్రేక్‌ వేయడం మర్చిపోయాడట. అదే సమయంలో గాలి ఎక్కువగా రావడంతో కారు దానంతట అదే కొంత దూరం వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో హుయాంగ్‌ ఊపిరి పీల్చుకున్నాడు. పార్కింగ్‌కు కొంత దూరంలో ఆగిపోయిన తన కారును తెచ్చుకున్నాడు.

చైనాలో ఇలాంటి ఘటనలు సాధారణమే. గతవారం తూర్పు చైనాలో పెను గాలుల కారణంగా 62 అడుగుల భారీ విగ్రహం పడిపోయింది. గుయ్‌జౌ ప్రావిన్స్‌లో చెక్కతో నిర్మించిన 23 అంతస్థుల టవర్‌ కూడా కూలిపోయింది.

 

సంబంధిత వార్తలు

విద్యాసాగర్‌రావు ప్రథమ వర్థంతికి హాజరైన సీఎం

విద్యాసాగర్‌రావు ప్రథమ వర్థంతికి హాజరైన సీఎం

నటి ముఖంపై క‌రిచిన కుక్క‌

నటి ముఖంపై క‌రిచిన కుక్క‌

దంచుతున్న ఎండలు.. సీఎంవో సూచనలు

దంచుతున్న ఎండలు.. సీఎంవో సూచనలు

ఏసీబీకి చిక్కిన ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్

ఏసీబీకి చిక్కిన ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్

సైబర్‌చీటర్ల నయా మోసం..

సైబర్‌చీటర్ల నయా మోసం..

రాబోయే మూడునాలుగు గంటల్లో హైదరాబాద్‌లో వర్షం

రాబోయే మూడునాలుగు గంటల్లో హైదరాబాద్‌లో వర్షం

నేడు, రేపు జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలు

నేడు, రేపు జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలు

ఏ.పీ.రంగారావు మృతిపట్ల కేసీఆర్ సంతాపం

ఏ.పీ.రంగారావు మృతిపట్ల కేసీఆర్ సంతాపం

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR