ఆస్ట్రేలియాలో ఘనంగా బోనాల జాతర..

ఆస్ట్రేలియాలో ఘనంగా బోనాల జాతర..


- మెల్బోర్న్ తెలంగాణ న్యూస్ సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం.. 

మెల్బోర్న్, 26 జూలై : 
మెల్బోర్న్ నగరంలో రాక్ బ్యాంక్ దుర్గ మాత టెంపుల్ లో మెల్బోర్న్ తెలంగాణ న్యూస్ సంస్థ ఆధ్వర్యంలో..  బోనాల జాతర ఘనంగా జరిపారు. అధిక సంఖ్యలో పాల్గొన్న తెలంగాణ మహిళలు అమ్మవారికి  బోనాలు, తొట్టెలు  సమర్పించుకుని తమ మొక్కును చెల్లించుకున్నారు. పోతురాజుల ఆట, పాటలతో, యువకుల నృత్యాలతో  దుర్గ మాత ఆలయంలో ఎంతో సందడి చేసారు. బోనాల పాటలకు చేసిన నృత్యాలకు భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా నాట్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణలో ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్నఈ వేడుకలను అదే స్థాయిలో గత 7 సంవత్సరాలుగా  నిర్వహిస్తున్న మెల్బోర్న్ తెలంగాణ న్యూస్ సంస్థ నిర్వాహకులు తెలంగాణ మధు, రాజు వేముల, ప్రజీత్ రెడ్డి కోతి, దీపక్ గద్దె లను ఈ వేడుకలకు హాజరైన వివిధ సంఘాల నాయకులు, ప్రజలు అభినందించారు.

Tags :