అంధ పాఠశాలలో అంధులను చేర్పించండి..

అంధ పాఠశాలలో అంధులను చేర్పించండి..


- బంగారు పథకం పొందండి.. 
- సూచించిన డ్యాబ్ సంస్థ ప్రధాన కార్యదర్శి పానుగంటి చొక్కారావు.. 

హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :

రాష్ట్రంలోని అంధ విద్యార్థులను అంధ పాఠశాలలో చేర్పించి, బంగారు పథకాలను అందజేస్తామని డ్యాబ్ ప్రధాన కార్యదర్శి, ఏఐసీబీ కార్యదర్శి, అంధుల పాఠశాల నిర్వాహకులు  పానుగంటి చొక్కారావు తెలియజేశారు.. బుధవారం మలక్ పేట్ లోని వికలాంగుల సంక్షేమ భవనంలో ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా డ్యాబ్ చే నిర్వహించబడుతున్న నల్లగొండలోని అంధుల పాఠశాలలో 10 మంది అంధ బాల, బాలికలను చేర్పించామని, అయితే వారికి బంగారు పతకాలను, పొరుగువారికి చేర్పించిన వారికి వెండి పతకాలతో సత్కరిస్తామని తెలియజేశారు.. ప్రయివేట్ పాఠశాలలో అంధులను చేర్పించవద్దని, తల్లి, దండ్రులకు విజ్ఞప్తి చేశారు.. ఎందుకంటే ఆ పాఠశాలలో సరైన ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండరని, ఈ విషయం తల్లి, దండ్రులు గుర్తించాలని ఆయన సూచించారు.. నల్లగొండ జిల్లా కేంద్రంలో 1996 నుంచి పాఠశాలను నడిపిస్తున్నామని తెలిపారు.. 1 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.. ఈ విలేఖరుల సమావేశంలో కోశాధికారి పరమేష్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు..

Tags :