రేవ‌ణ్ణ‌కు బీజేపీ ఆఫ‌ర్‌

Updated:15/05/2018 06:59 AM

bjp offer to revnna

కర్ణాటక రాజీకీయాలు ఆసక్తిగా మారాయి. కింగ్ మేకర్ అనుకున్న జేడీఎస్ అధినేత కుమారస్వామి ఏకంగా కింగ్‌గా మారి కుర్చి ఎక్కబోతున్నారు. పిట్ట్టపోరు.. పిట్టపోరు పిల్లి తీర్చినట్లు 104 స్థానాలు గెలిచిన బీజేపీ, 78 సీట్లు వచ్చిన కాంగ్రెస్‌ను కాదని 38 సీట్లు వచ్చిన జేడీఎస్ సీఎం సీటును తన్నుకు పోతున్నది. ఉదయం నుంచి గంటగంటకు మారుతున్న ఎన్నికల ఫలితాల సరళిలో మ్యాజిక్ ఫిగర్(112)కు కొంచెం దూరంలో (104) బీజేపీ ఆగిపోవడంతో కాంగ్రెస్ చక్రం తిప్పింది. దేవేగౌడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. ఢిల్లీ నుంచి సోనియాగాంధీ డైరెక్షన్.. బెంగళూరులో ఆజాద్ యాక్షన్ వెరసి కుమారస్వామి సీఎం అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఏపార్టీకి స్ఫష్టమైన మెజారిటీ రానందున ఎలాగైనా బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్లాన్ వేసింది. జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మద్దతిస్తామని అదికూడా అన్ కండీషనల్‌గా ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. కాంగ్రెస్‌తో చర్చించిన కుమారస్వామి ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పారు. ఇదిలా ఉంటే.. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ తన వ్యూహానికి పదును పెడుతున్నది. జేడీఎస్‌లో 12 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న దేవగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణకు వల వేసేందుకు ప్రయత్నిస్తున్నది. రేవణ్ణకు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చి జేడీఎస్‌ను చీల్చేందుకు ప్లాన్ వేసినట్లు సమాచారం. దీంతో కర్ణాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ప్రతీ సీను క్లెమాక్స్‌ను తలపిస్తున్నది.