శ్రీదేవిని హత్య చేశారు - బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి..!

Updated:27/02/2018 02:14 AM

bjp leader subramanian swamy sensational comments on actress sridevi death

శ్రీదేవి మృతి తర్వాత పరిణామాల పై క్షణక్షణం ఉత్కంఠ పెంచుతుండగా, బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి... శ్రీదేవి మృతి పై సంచలన ఆరోపణలు చేశార. శ్రీదేవిని హత్య చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు రాత్రి శ్రీదేవి హోటల్ గదిలోకి ఎవరు వెళ్లారో సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. శ్రీదేవి మృతి కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేసిన సుబ్రమణ్యస్వామి, దుబాయ్ పోలీసులు సీసీ టీవు ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయలేదని ప్రశ్నించారు.

శ్రీదేవికి మందు తాగే అలవాటు లేదన్న స్వామి ఆమె బాడీలో ఆల్కహాల్ ఎలా ఉందని ప్రశ్నించారు. ఎవరైనా ఆమెను బలవంతంగా తాగించారా? లేదా? తేలానన్నారు స్వామి. ఏ విషయంలోనైనా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడే సుబ్రమణ్యస్వామి, శ్రీదేవి మృతి పై అనుమానాలు వ్యక్తం చేయడం కొత్త చర్చకు దారి తీసింది. ఇప్పటికే శ్రీదేవి మృతి పై పలు అనుమానాలకు తావిస్తుండగా, ఆమె భౌతికకాయం ఇంకా దుబాయ్ లోనే ఉండిపోయింది. ఈ కేసులో కీలకంగా మారిన శ్రీదేవి భర్త బోనీ కపూర్ ను ఈ రోజు కూడా ప్రశ్నించారు దుబాయ్ పోలీసులు.

చిక్కుముడిగా ఉన్న ప్రశ్నలు ఇవే :

1 శ్రీదేవిని అపస్మారక స్థితిలో చూసినప్పుడు ఏం జరిగింది. ఆమె ఎలా ఉంది.? పోలీసులకు ఎప్పుడు ఇన్ఫామ్ చేశారు. ఈ మధ్య ఎంత సమయం ఉంది. ఈ టైంలో మీరు ఏం చేశారు?

2 శ్రీదేవి తలకు గానీ మరెక్కడైనా శరీరంపై గాయాలు అయ్యాయా.. మీరు చూశారా? పరిశీలించారా?

3 శ్రీదేవి చనిపోయిన ఖచ్చితమైన సమయం ఎంత?

4 బాత్ రూం డోర్ ఎలా ఓపెన్ చేశారు. ఏ విధంగా పగొలగొట్టారు? తలపు పగలగొట్టే సమయంలో మీతో ఎవరు ఉన్నారు? ఎంత మంది సహాయం చేశారు? అసలు మీరు అక్కడ ఉన్నారా లేదా?

5 రాత్రి 10.30 గంటల టైంలో మంచినీళ్లు కావాలని రూం సర్వీస్ కు శ్రీదేవి కాల్ చేసింది. 15 నిమిషాల తర్వాత వాటర్ తీసుకుని వచ్చిన రూం సర్వీస్ వ్యక్తికి రెస్పాన్స్ కాలేదు శ్రీదేవి. డోర్ కొట్టినా ఎందుకు తెరవలేదు. ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు ?

6 బాత్ రూం డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లినప్పుడు.. బాత్ టబ్ లో నీళ్లు నిండి ఉన్నాయా? నీళ్లు ఎంత పరిమాణంలో ఉన్నాయి?

7 బాత్ రూం డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లినప్పుడు శ్రీదేవి నాడి కొట్టుకుంటూ ఉందని హోటల్ సిబ్బందిలోని ఓ ఉద్యోగి చెబుతున్నాడు. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు.. మీరు డోర్ పగలగొట్టిన వారిలో ఉన్నారా లేదా?

8 పెళ్లి వేడుకలో శ్రీదేవి ఒంటరిగా గడిపారని హోటల్ సిబ్బంది చెబుతోంది. అంటే మీ మధ్య ఏమైనా గొడవలు జరిగాయా.. కుటుంబ గొడవలు ఉన్నాయా?

( ఇక్కడ కోర్టు మరో క్వశ్చన్ కూడా వేస్తోంది. శ్రీదేవి డోర్ లాక్ చేసుకుని ఉన్నారని హోటల్ సిబ్బంది చెబుతుంటే.. రెండు డోర్లు పగలగొట్టాలి. ఒకటి మెయిన్ డోర్, మరొకటి బాత్ రూం డోర్. మెయిన్ డోర్ ఎవరు ఓపెన్ చేశారు.. కాలింగ్ బెల్ నొక్కినా ఎంత సమయం వరకు ఆమె రెస్పాన్స్ కాలేదు.?)