చంద్రబాబు కుట్ర విఫలం : రాంమాధవ్

Updated:15/05/2018 01:48 AM

bjp leader ram madhav fire on chandrababu politics

కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలు విఫలమయ్యాయని బీజేపీ నాయకుడు రాంమాధవ్ ట్వీట్ చేశారు. కర్ణాటకలో బీజేపీని ఓడించేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయొద్దని తెలుగు ప్రజలకు పిలుపునిచ్చినా కూడా హైదరాబాద్ కర్ణాటకలో బీజేపీ గెలిచిందన్నారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని రాంమాధవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ కర్ణాటకలో 40 స్థానాలకు గానూ.. 20 స్థానాలకు పైగా బీజేపీ ఆధిక్యంలో ఉందన్నారు. 2013లో ఈ ప్రాంతంలో 6 స్థానాలకే బీజేపీ పరిమితమైంది. దక్షిణాదిలో తమ విజయానికి బాటలు పడ్డాయన్నారు రాంమాధవ్.