ఆదాబ్ కి కృతజ్ఞతలు..

ఆదాబ్ కి కృతజ్ఞతలు..


( ఆదాబ్ కథనం చదివి బీజీఆర్ 34 మాత్రలు తెప్పించుకున్న వైనం.. )
- షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే ఆయుర్వేద గోళీల గురించి ఆదాబ్ లో కథనం.. 
- ఈ కథనం చదివి స్పందించిన పలువురు షుగర్ వ్యాధిగ్రస్తులు..
- అమెజాన్ ద్వారా బీజీఆర్ 34 మాత్రలు 3 రోజుల్లో సరఫరా.. 
- ఉపయోగపడే కథనాలు ప్రచురించే ఆదాబ్ కి సర్వత్రా అభినందనలు.. 

హైదరాబాద్, 03 ఆగష్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) :

షుగర్ వ్యాధి గ్రస్తులకు శుభవార్త చెబుతూ.. 'ఆదాబ్ హైదరాబాద్' బీజీఆర్ 34 ఆయుర్వేద మాత్రల గురించి పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించిన సంగతి విదితమే.. ఈ కథనానికి విపరీతమైన స్పందన వచ్చింది.. షుగర్ వ్యాధి బారిన పడి, ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక, ఎన్నెన్నో మందులు వాడుతూ మానసిక క్షోభకు గురైన వారికి బీజీఆర్ మాత్రల, కథనం ఒక చుక్కానిలా కనిపించింది.. ( ఇంట్రో ) 

కేంద్ర ఆరోగ్య సంస్థలు సి.ఎస్.ఐ.ఆర్.. కు సంబంధించిన ఎం.బీ.ఆర్.ఐ., సి.ఐ.ఎం.ఏ.పీ. సంస్థలు విస్తృత పరిశోధనలు చేసి, షుగర్ వ్యాధిపై ప్రభావవంతంగా పనిచేసే ఆయుర్వేద మాత్రలను తయారుచేసి, మార్కెట్ లోకి ప్రవేశపెట్టాయి.. పరిశోధనలు చేస్తున్న సమయంలో ఎన్నో వేలమంది మీద ప్రయోగించడం, ఆ ప్రయోగాలు విజయవంతం అవడంతో.. ఈ మాత్రలు నిరభ్యంతరంగా వాడొచ్చని, ఆయుర్వేద వైద్య నిపుణులు నిర్ధారణకు వచ్చారు..  అతి తక్కువ ఖర్చుతో అంటే ఒక్క టాబ్లెట్ కేవలం 5 రూపాయలకు లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంది.. ఒక బాక్స్ లో 100 మాత్రలు ప్యాక్ చేసి ఆన్ లైన్ లో తెప్పించుకునేందుకు వీలు కల్పించింది ప్రభుత్వం.. ఈ మాత్రలు వాడిన 10 రోజుల్లోనే మంచి ఫలితాలు వచ్చాయని వైద్యులు తెలిపారు.. కనుక ఈ మాత్రలు అమెజాన్ ద్వారా ఆన్ లైన్ లో తెప్పించుకుని వాడవచ్చు.. రోజుకి రెండు మాత్రల చొప్పున.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు అరగంట ముందు.. అదే విధంగా రాత్రి భోజనానికి ఒక అరగంట ముందు ఒక మాత్ర వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.. క్రమం తప్పకుండా రెండు, మూడు నెలలు ఈ మాత్రలు వాడగలిగితే..  ఇక భవిష్యత్తులు షుగర్ కు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఎదురు కావవని వారు తెలియజేస్తున్నారు..

Tags :