ముంచుకోస్తున్న మహా ప్రళయం..!!

ముంచుకోస్తున్న మహా ప్రళయం..!!


- భూమి అంతమైపోనుందా.. అన్న సంకేతాలు.. 
- ఒకప్పటి డైనోసార్ల మాదిరిగానే జీవం అంతరించిపోనుందా.. ? 
- ఆందోళన రేకిస్తున్న నాసా సైంటిస్ట్ ల ప్రకటన.. 
- వివరాలందించిన ఒసిరిస్-రెక్స్ నాసా అంతరిక్ష నౌక.. 

న్యూ ఢిల్లీ, 26 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
మహా ప్రళయం ముంచుకొస్తోందా.. ? భూమి అంతమైపోనుందా.. ? ఒకప్పటి దుర్ఘటన జరిగినట్లు  డైనోసార్ల మాదిరిగానే పూర్తిగా జీవం అంతరించిపోనుందా.. ? ఈ విషయం ఇప్పుడిదే ఆందోళన రేకితిస్తోంది. ఎందుకంటే.. అతిభారీ గ్రహ శకలం ఒకటి భూమికి అతిదగ్గరగా దూసుకొస్తోంది. ఈ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టే చాన్స్ ఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. సుమారు 6.5 కోట్ల ఏళ్ల క్రితం పది కిలోమీటర్ల వెడల్పు ఉన్న గ్రహశకలం భూమిని ఢీకొట్టింది. అప్పుడు డైనోసార్లు సహా 75 శాతానికి పైగా జీవం అంతరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి మరో గ్రహశకలం భూమిని ఢీకొట్టబోతుందంటూ నాసా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

ఆ గ్రహ శకలానికి  ‘బెన్ను’ గా నామకరణం చేశారు సైంటిస్టులు. ఈ ఆస్టరాయిడ్‌పై ‘నాసా’ సైంటిస్టులు పరిశోధనలు జరుపుతున్నారు. ఒసిరిస్-రెక్స్ నాసా అంతరిక్ష నౌక అందించిన డేటా ఆధారంగా.. వచ్చే శతాబ్దంలో బెన్ను గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. గతంలో కంటే భారీ ముప్పు పొంచి ఉందని అంటున్నారు. ఈ బెన్ను వెడల్పు 490 మీటర్లు.. అంటే.. 1600 అడుగులు అనమాట. రాబోయే మూడు వందల ఏళ్ల వరకు భూమికి దూరంగానే వెళ్తుందని భావించగా.. ఇప్పుడు నానా నిర్వహించగా అధ్యయనంలో భాగంగా అంచనాలు తారుమారయ్యాయి. శాస్త్రవేత్తలు గతంలో బెన్నూ-1,700 అడుగుల వెడల్పు (518 మీటర్లు) గ్రహశకలం 2200లో భూమిని ఢీకొట్టే అవకాశం 2,700లో ఒక వంతు ఉందని అంచనా వేశారు. కానీ, 2300 సంవత్సరానికి 1,750లో ఒక వంతు ఉందని అంచనాకు వచ్చారు. బెన్ను అనే గ్రహశకలం 2135 నాటికి భూగ్రహం దగ్గరగా వస్తుందని అంచనా వేస్తున్నారు. 1.2 ఏళ్లకు ఒకసారి సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఈ ‘బెన్ను’ రెండు సార్లు భూమి కక్ష్యను దాటుతుంది. ఈ క్రమంలో భూమికి అతితగ్గరకు దూసుకొచ్చే ప్రమాదం ఉందని నాసా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

Tags :