కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లను అరెస్ట్ చేయ్యాలి

Updated:13/03/2018 05:02 AM

arrest of komatireddy and sampathkumar

సోమవారం శాసనసభలో జరిగిన సంఘటన పథకం ప్రకారమే జరిగిందని ప్రభుత్వ విప్ పల్లా, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమక్షంలోనే ఈ పథకానికి అంకురార్పణ జరిగిందని ఆయన ఆరోపించారు. అయితే అది స్వామిగౌడ్‌పై జరిగే దాడి కాదని, గవర్నర్ లక్ష్యంగానే జరిగిందని అన్నారు. గవర్నర్‌ను గురి చూసి కొట్టే బాద్యతను కోమటిరెడ్డి, సంపత్‌కు అప్పజెప్పారని అన్నారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై దాడికి పాల్పడ్డ కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.