బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌లో మరో స్వర్ణం

Updated:09/04/2018 08:17 AM

another medal in badminton mixed game

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్ అదరగొడుతోంది. స్వర్ణ పతకాల సంఖ్యను మరింత పెంచుకుంటోంది. గుంటూరు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్‌, మంచి ఫామ్‌లో ఉన్న సైనా నెహ్వాల్‌ చెలరేగడంతో మిక్స్‌డ్‌ టీమ్‌ ఆటలో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. మూడు సార్లు విజేత, డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన మలేసియాను టీమిండియా చిత్తు చేసింది.

తొలుత సాత్విక్‌ రాంకీ రెడ్డి, అశ్విని పొన్నప్ప మిక్స్‌డ్‌ డబుల్స్‌లో 21-14, 15-21, 21-15 తేడాతో పెంగ్‌ సూన్‌ చాన్‌, లీ యంగ్‌ గో జోడీని చిత్తు చేసింది. ఆ తర్వాత యువ కెరటం శ్రీకాంత్‌ 21-17, 21-14తో మూడు సార్లు ఒలింపిక్‌ రజత పతక విజేత, దిగ్గజ ఆటగాడు లీ చాంగ్‌ వీకి షాకిచ్చాడు. పురుషుల డబుల్స్‌లో రాంకీ రెడ్డి, చిరాగ్‌ శెట్టి 15-21, 21-20, 20-22 తేడాతో గో, వీ కియాంగ్‌ ద్వయంతో జరిగిన పోరులో ఓటమి పాలయ్యారు. ఇక తప్పక గెలవాల్సిన మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్‌ దుమ్మురేపింది. యువ క్రీడాకారిణి సోనియాపై 21-11, 19-21, 21-9 తేడాతో చక్కని విజయం సాధించింది. రెండో గేమ్‌లో ప్రత్యర్థి అద్భుతంగా ఆడింది.

అంతకు ముందు మ్యాచ్‌లోనే సైనా గెలవడంతో మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి, అశ్విన్‌ జోడీ ఆడాల్సిన అవసరం రాలేదు.

 

 

సంబంధిత వార్తలు

స్టోక్స్‌కు స్ట్రోక్ ఇచ్చిన సురేశ్ రైనా

స్టోక్స్‌కు స్ట్రోక్ ఇచ్చిన సురేశ్ రైనా

సిక్స్ స్టార్ గేల్ సెంచరీలు..కోహ్లీ కన్నా ఎక్కువే

సిక్స్ స్టార్ గేల్ సెంచరీలు..కోహ్లీ కన్నా ఎక్కువే

వావ్..100 బంతుల క్రికెట్లో.. ఒక ఓవర్‌లో 10 బంతులు

వావ్..100 బంతుల క్రికెట్లో.. ఒక ఓవర్‌లో 10 బంతులు

నా ప్రియమైన సోదరుడా..మన్నించు: పాండ్య

నా ప్రియమైన సోదరుడా..మన్నించు: పాండ్య

మేము ఎలాంటి నేరం చేయలేదు: గౌతం గంభీర్ ఆవేదన

మేము ఎలాంటి నేరం చేయలేదు: గౌతం గంభీర్ ఆవేదన

కోల్‌ ఖతర్నాక్

కోల్‌ ఖతర్నాక్

మైదానంలో కోహ్లీ.. వ్యాన్‌లో అనుష్క శర్మ

మైదానంలో కోహ్లీ.. వ్యాన్‌లో అనుష్క శర్మ

స్పిన్‌తో దెబ్బ కొట్టారు.. రాజస్థాన్ స్కోరు 160

స్పిన్‌తో దెబ్బ కొట్టారు.. రాజస్థాన్ స్కోరు 160

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR