ముంపు ప్రాంతాల్లో వై.ఎస్. జగన్ పర్యటన..

ముంపు ప్రాంతాల్లో వై.ఎస్. జగన్ పర్యటన..

 

అమరావతి, 26 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) : 
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గన్నవరం మండలం ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహించింది. దీంతో చాల గ్రామాలు నీట మునిగాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు గ్రామాలు మాత్రం ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో సీఎం జగన్ జిల్లాలో పర్యటిస్తున్నారు. సహాయక చర్యలను అడిగి తెలుసుకుంటూ అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలిచ్చారు.

పి. గన్నవరం మండలంలో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చి ముందుకు కదిలారు జగన్. సాయంత్రం రాజమండ్రి వెళ్లనున్నారు జగన్. వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 

Tags :