ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం..

ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం..


- 465 మంది హోమ్ గార్డులను ఏపీ కి తీసుకుంటామని హామీ.. 
- హర్షం వ్యక్తం చేసిన హోమ్ గార్డులు.. 
హైదరాబాద్, 12 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ స్థానికత ఉన్న 465 మంది హోంగార్డ్స్ ని  ఏపీకి తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.. ఎంతో కాలంగా ఈ సమస్య పై ఏ ముఖ్యమంత్రి స్పందించలేదు. కానీ తమ కలల్ని సాకారం చేస్తూ జగన్ తమ  సమస్ పై సానుకూలంగా స్పందించారు. మొత్తానికి 465 లిస్ట్ తయారు చేసి డీజీపీ ఆమోదం కోసం పంపించడం జరిగింది. అతి త్వరలోనే ఎన్.ఓ.సి. వస్తుంది అని వారు ఆశిస్తున్నారు.. పిల్లల చదువు కోసం ఆయా స్కూళ్లకు చెందిన వాళ్లు ఫోన్లు చేస్తున్నారు. దయచేసి త్వరగా ఈ విషయం పై నిర్ణయం తీసుకుని హైదరాబాద్ లో స్కూల్ ఫీజులు కట్టే పరిస్థితి నుండి  తమని రక్షిస్తారని మనసారా వేడుకుంటున్నారు హోం గార్డులైన నారాయణ రెడ్డి, రంగారెడ్డి, మోహన్ రెడ్డి, భాషా, ఆదినారాయణ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు..

Tags :