సతీ వియోగం..

సతీ వియోగం..


హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక కుత్బుల్లాపూర్ ప్రతినిధి వై. సంతోష్ కుమార్ సతీమణి ఎదుగని సరిత అనారోగ్య కారణాలచేత బుధవారం రోజు పరమపదించారు.. గత కొద్దీ కాలంగా అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సరిత తుది శ్వాస విడిచారు.. ఆమె మృతిపట్ల భర్త సంతోష్ కుమార్ తోబాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.. సంతోష్ కుమార్ కి ఆ భగవంతుడు ధైర్యాన్ని కలుగజేయాలని పలువురు పాత్రికేయ మిత్రులు ఆయనకు తమ సానుభూతిని తెలియజేశారు..

Tags :