పడుకుంటేనే ఆఫర్లు.. వాడుకొని వదిలేస్తారు..

Updated:13/03/2018 03:53 AM

actress sri reddy sensational comments on film industry

వర్ధమాన తార శ్రీరెడ్డి మంచి యాంకర్ మాత్రమే కాదు.. ప్రతిభావంతురాలైన నటి. టెలివిజన్ రంగంలో రాణిస్తుండగానే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. పలు సినిమాల్లో నటించినా ఆశించినంత ఫలితం దక్కలేదు. గత కొద్దిరోజులుగా మాడలింగ్ రంగంలో కాలం వెల్లదీస్తున్న శ్రీరెడ్డి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ ఆఫర్లు ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీరెడ్డి వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే...

క్యాస్టింగ్ కౌచ్ పెద్ద మాట
క్యాస్టింగ్ కౌచ్ (వేషాల కోసం పడకగదిలోకి) అంటే చాలా పెద్ద పదం. చాలా పెద్ద విషయం. ఒక అమ్మాయి సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టపడాలి. శారీరాన్ని కాపాడుకోవాలి. అందుకోసం జిమ్‌కు వెళ్లి ఎక్స్‌ర్‌సైజులు చేయాలి. అందంగా ఉండటానికి కడుపు మాడ్చుకోవాలి అని శ్రీరెడ్డి అన్నారు.

ఆఫర్ల కోసం కడుపు మాడ్చుకొంటాం..
తాము అంతగా కష్టపడుతుంటే ఎందుకమ్మ ఉపవాసాలు ఉండటం అని అంటారు. ఎవరైనా కడుపు నింపుకోవడానికి కష్టపడుతారు. మీరు ఎందుకు కడుపు మాడ్చుకొంటారు అని ఆమె అన్నారు. నటిగా నిలదొక్కుకొనే క్రమంలో సుఖశాంతులు ఉండవు అని చెప్పారు.

ఎలా జీవించాలో తెలియదు..
ఒక ప్రాజెక్ట్ అయిపోతే మరో ప్రాజెక్ట్ ఎప్పుడోస్తుందో తెలియదు. వస్తుందా రాదా అనే ప్రశ్నార్థకం. హైదరాబాద్‌లో బతకాలంటే ఎంత ఖర్చు ఉంటుందో తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో నాలాంటి వాళ్ల పరిస్థితి ఏమిటి? వాళ్లు ఎలా జీవించాలి అనే ఆవేదన వ్యక్తం చేశారు.

ముంబై నుంచి హీరోయిన్లను
టాలీవుడ్‌లో ఏడాదికి 100 సినిమాలు రిలీజ్ అయితే మూడు, లేదా నాలుగు సినిమాలు హిట్టవుతున్నాయి. ఫెయిల్యూర్స్ కారణమేమిటంటే ముఖ్యంగా తెలుగు నేటివిటి ఉండకపోవడమే. ముంబై నుంచి హీరోయిన్లను తీసుకోస్తారు. వాళ్లకు డైలాగ్ చెబితే లిప్ సింక్ కాదు.

నాన్నలు, తాతల పేర్లు తగిలించుకొనే హీరోలు, నాని లాంటి వాళ్లకు కన్నడ, తమిళ, మలయాళ, ముంబై హీరోయిన్లు అయితేనే ఇష్టం. తెలుగు అమ్మాయిలంటే ఎందుకు దూరం పెడుతారు. మేము ఎక్స్‌పోజింగ్ చేయలేమా? డైలాగ్ చెప్పలేమా? ఎందుకు తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదనేది మిలియన్ డాలర్ ప్రశ్న.

మాతో పడుకొంటారా?
ఆఫర్ ఇచ్చే ముందు తమిళంలో కాంప్రమైజ్ అవుతారా? తెలుగులో కమిట్‌మెంట్ ఇస్తారా అని అడుగుతారు. ఆ ప్రశ్నలకు మాతో పడుకొంటారా అని అర్థం అని శ్రీరెడ్డి అన్నారు. అలా సిద్ధపడిపోతే చివరకు కేవలం ఓ మామూలు క్యారెక్టర్ దొరకడం మినహా ఏమీ ఉండదు.

తెలుగు అమ్మాయిలు పడుకొంటేనే పని అవుతుంది. క్యాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్లు అర్చన, రాధికా ఆప్టే చెప్పింది. శ్రీయ కూడా నోరు విప్పింది. ఇంకా చాలా మంది చెబుతున్నారు. పడుకుంటేనే ఆఫర్లు దక్కుతాయి. ఓ దశలో ఆకలికి నకనకలాడాల్సి వస్తుంది. అనేక ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. నా తల్లిదండ్రులు చెప్పినా వినికుండా వచ్చి అనేక సమస్యల్లో కూరుకుపోవాల్సి వస్తుంది.

ఆఫర్ల కోసం అన్ని వదులుకొన్నా గానీ, అనేక అవమానాలకు గురైనా గానీ చివరికీ ఏమీ దక్కదు. ఏ ఉద్యోగం చేసుకొన్నగానీ నెలకు ఇంత డబ్బు వస్తుంది. కానీ హీరోయిన్లకు ఆ పరిస్థితి లేదు. ఇక తెలుగు అమ్మాయిలు రావడం అందుకే రావడం లేదు.

వాడుకొని వదిలేస్తారు..
సినిమా అవకాశాలు ఇస్తామని చెప్పి వాడుకొంటారు. ఆ తర్వాత సినిమా ఆగిపోయింది అంటారు. లేకపోతే నిర్మాతతోపాటు డైరెక్టర్, ఆ తర్వాత కెమెరామెన్ కూడా ఉన్నారని చెబుతారు. అందుకు సమ్మతించిన తర్వాత సినిమా ఆగిపోయింది అని చెబుతారు. అలాంటి మాటలు, చెండాలాన్ని చూడటానికి మేము అలవాటు పడిపోయాం.

ఇండస్ట్రీలో ఎంతమందిని నిర్మాత, దర్శకులు వాడుకొని వదిలేశారో నాకు తెలుసు. అలాంటి వారి పేర్లు తెలిసినా గానీ కెమెరా ముందు నేను చెప్పను. నా గురించి నేను చెప్పుకోవడానికి హక్కు ఉంది. కానీ వేరే వాళ్ల గురించి చెప్పడం సరికాదు అని అన్నారు.

ఆఫర్ల కోసం సిగ్గులేకుండా
నేను హాట్‌గా ఉన్నాను. సిగ్గులేకుండా నా శారీరాన్ని ఎందుకు ఎక్స్‌పోజ్ చేసుకొంటున్నాను? నేను బోల్డ్‌గా మాట్లాడుతున్నాన్నంటే కారణం ఆఫర్ల కోసమే. కానీ నాకు ఆఫర్లు వచ్చాయా? అంటే అదీ లేదు.

తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రాకపోవడానికి మన సినిమా పరిశ్రమనే కారణం. రామానాయుడు, అల్లు అరవింద్ లాంటి ప్రొడక్షన్ హౌస్‌లు ఉన్నాయి. వాళ్లు కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు. బడా నిర్మాతలు తెలుగు అమ్మాయిలకే అవకాశం ఇవ్వాలి. అమెరికాలో మాదిరిగానే లోకల్ వాళ్లకే అవకాశాలు ఇవ్వాలని ట్రంప్ నిర్ణయం తీసుకొన్న విధంగా మన తెలుగు నిర్మాతలు ఇక్కడి అమ్మాయిలకే అవకాశం ఇవ్వాలి అని శ్రీరెడ్డి అన్నారు.