యాక్సిడెంట్ అయిన వ్యక్తులకు ఎంతో మేలు చేసే "గోల్డెన్ అవర్ చికిత్స":

యాక్సిడెంట్ అయిన వ్యక్తులకు ఎంతో మేలు చేసే "గోల్డెన్ అవర్ చికిత్స":


- వెల్లడించిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వి.కె.వి ప్రసాద్..     

హైదరాబాద్, 04 ఆగష్టు ( ఆదాబ్ హైదరాబాద్ ) :
మన దేశంలో ఎక్కువమంది ఆరోగ్యవంతులు, కుటుంబాన్ని పోషించే పురుషులు చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదం బారిన పడటం వల్ల తమ జీవితాలు కోల్పోవడమే కాకుండా  వాళ్ళ పై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు  పడతారు. ఇలా వాళ్ల జీవితాలు అర్ధాంతరంగా ముగియకుండా,  అలాగే యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్లకు అక్కడే గోల్డెన్ అవర్ తో తగిన వైద్య సహాయం అందేలోపు తీసుకోవాల్సిన చర్యల గురించి అందరికి అవగాహన కల్పించాలని, అలాగే సమాజంలో అందరికీ మన ఎముకల ఆరోగ్యం గురించి తెలియచెప్పాలని ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్  2012 సంవత్సరంలో ఆగస్టు 1వ నుండి 7 వ తారీఖు వరకు ఎముకలు కీళ్ల వారోత్సవం గానూ,  ఆగస్టు 4న ఎముకలు కీళ్ల దినోత్సవంగా ప్రకటించింది.   

ఈ ఉత్సవంలో దేశంలో ఉండే ఎముకల వైద్యులు వాళ్లు పనిచేసే ఆస్పత్రులు, వైద్య కళాశాలలలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్ తో ముందుకు వెళుతున్నారు. ఈ సంవత్సరం " ఈచ్ వన్ - సేవ్ వన్ " అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహించాలని నిశ్చయించారు. మెడిసిటీ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో కూడా ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అక్కడి ఎముకల విభాగం డాక్టర్ వి.కె.వి ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ ఎంఎస్ గౌడ్, డాక్టర్ కల్యాణ్, డాక్టర్ కౌషిక్ ల తోడ్పాటుతో మెడిసిటీ యాజమాన్యం రిషికేశ్ చిట్టినేని, ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ శైలేంద్ర, డాక్టర్ నేగి, మేనేజర్ డాక్టర్ వైష్ణవ్ సౌజన్యంతో ఈ ఉత్సవాలు నిర్వహించారు.

కార్యక్రమం యొక్క హైలైట్స్:

- హాస్పిటల్ ఆవరణలో ఉచిత ఎముకల సాంద్రత పరీక్షలు నిర్వహించారు.  కళాశాల విద్యార్థుల లో ఈ విషయాల గురించి అవగాహన పెంపొందించడానికి లెక్చర్లు, వర్క్ షాప్స్ నిర్వహించారు. విద్యార్థులకు పోస్టర్ ప్రెజెంటేషన్ వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన ఒక చిన్న నాటిక చూపరులను ఆకట్టుకుంది. హాస్పిటల్ లో పనిచేసే వార్డ్ బాయ్స్ కి, డ్రైవర్లకి కూడా ఆక్సిడెంట్ బారిన పడ్డ వ్యక్తులకు చేయవలసిన ప్రథమ చికిత్స వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, వర్క్షాప్ ద్వారా  తెలియజేయడం అందరికీ బాగా నచ్చింది.
ఇదిలా ఉండగా, ఇద్దరు ఆంబులెన్స్ డ్రైవర్లను కిమ్స్ హాస్పటల్ వాళ్ళు నిర్వహించే సమష్టి కార్యక్రమానికి పంపడం జరిగింది.

Tags :