సాయి కుమార్ త‌నయుడు కొత్త సినిమా ప్రారంభం

Updated:27/05/2018 03:37 AM

aadi sai kumar new film launched

సాయి కుమార్ త‌న‌యుడు ఆది కొత్త సినిమా కొద్ది సేప‌టి క్రితం ఫిలిం న‌గ‌ర్ దైవ సన్నిధానంలో గ్రాండ్‌గా లాంచ్ అయింది. హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కొద్ది సేప‌టి క్రితం జ‌రిగిన లాంచింగ్ కార్య‌క్ర‌మంలో వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టగా.. డీసీపీ.కృష్ణ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సాయి కుమార్ స్క్రిప్ట్ అందజేయడం జరిగింది. హీరో నాగశౌర్య, వంశి పైడిపల్లి, నిర్మాత భరత్ చౌదరి, సాయి కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం ప్యూర్ ల‌వ్ స్టోరీ అని ఆది చెప్పారు. ఈ చిత్రంలో రెండు షేడ్స్‌లో తాను క‌నిపిస్తున్నాని చెప్పిన ఆది త్వ‌ర‌లో హీరోయిన్ ఎవ‌ర‌నేది ప్ర‌క‌టిస్తామ‌ని అన్నాడు. రాజీవ్ కనకాల, రాధికా, రావు రమేష్, అజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని టీం న‌మ్ముతుంది.