ఆజ్ కి బాత్..

దేశమంటే ఎతైన విగ్రహాలు, కార్లు, కండ్లద్దాలు..
ఖద్దరంగీల ధగధగల మెరుపులు కాదు..
బురదగుంతల అడుగుజాడల మీద
బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో
పెట్టుకుని బ్రతుకుతున్న జీవితాల కథ..
మత మందిరాల కోసం వేలకోట్లు తగలేయడం కాదు..
మట్టి జీవుల కోసం.. మానవ మనుగడ కోసం
విద్య వైద్యాలయాల పునాదుల జాడ..
కడుపు నిండగా తిని కండ్లు కావరమెక్కిన
బడాయిల చరిత్ర కాదు దేశమంటే..
పూట గడిస్తే చాలనీ మెతుకు మెతుకుకు
బతుకు పోరాటం చేస్తూ.. ఆకలి యుద్ధంలో
అమరులై ఒరిగిపోయిన నిరుపేదల జీవన దృశ్యం...
పరదాలదాపుకి చలికి వణుక్కుంటూ..
తెల్లారితే జీవం గాల్లో కలిసిపోతదేమోనని
ఊపిరిని పిడికిట్లో దాసుకున్న శ్రమజీవుల
ఆర్తిగీతం.. దేశమంటే..
- కనకమామిడి సన్నీ
Tags :