ఆజ్ కి బాత్..

ఏ పార్టీ సభలు పెట్టినా లక్షల్లో జనాలు..
నాయకుల గుండెల్లో మోగుతున్నాయి
అనుమానాల సవాళ్లు..
హాజరైన జనాల ఓట్లు తమకే పడతాయని
ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు..
స్వచ్చందంగా తరలి వస్తున్నారా..?
డబ్బులు పంచితే వస్తున్నారా..?
అన్నది విశ్లేషకుల అనుమానం..
ఏదేమైనా ఎదో మార్పు ప్రజలు
కోరుకుంటున్నారన్నది కాదనలేని నిజం..
మరి ఎవరిని అందలం ఎక్కిస్తారన్నది
ఆసక్తికరంగా మారింది..
ప్రియమైన ప్రజలకు ఒకటే విజ్ఞప్తి..
దయచేసి మీ ఓటును అమ్ముకోకండి..
మిమ్మల్ని మీరు అమ్ముకోకండి..
ఆత్మవిమర్శ చేసుకోండి.. ప్లీజ్..
- బోయినపల్లి రమణ..
Tags :