ఆజ్ కి బాత్..

భారతావని భోరున విలపిస్తోంది..
తన ఎదపై గగులుతున్న నిరసనల
బడబాగ్ని అసలు ఆగిపోతుందా..?
అని ఆందోళన పడుతోంది..
ప్రభుత్వాలెన్ని మారుతున్నా..
స్వార్ధపూరిత అరాచకం
రాజ్యమేలుతుండటంతో...
తనను నమ్ముకున్న ప్రజల బ్రతుకులు
ఎప్పుడు బాగుపడతాయో అన్న బెంగతో
వణకి పోతోంది..
అమ్మా నీ కన్నీరు తుడిచే శక్తి మాకుంది..
ఓటు అనే మహత్తర ఆయుధం ఉంది..
కానీ మా స్వార్ధం కోసం అమ్ముకుంటున్నాం..
మమ్మల్ని క్షమించు.. ఇప్పటికైనా
మా మనసులు మారేలా దీవించు..
ఈసారి ఎన్నికలను మా బాధ్యతగా భావిస్తాం..
కుహనా నాయకులకు ఓటుతో బుద్ధి చెబుతాం..
ఈ గడ్డమీద పుట్టినందుకు
నీ ఋణం తీర్చుకుంటాం..
నీ మీద ఒట్టు...
- బోయినపల్లి రమణ..
Tags :