ఆజ్ కి బాత్..

ఆజ్ కి బాత్..

చదువుల పండుగ మొదలైంది.. 
తల్లి దండ్రుల గుండెల్లో గుబులు పెరిగింది.. 
పిల్లల భవిష్యత్తుపై ఆందోళన మొదలైంది.. 
ప్రభుత్వబడుల పరిస్థితి దిగజారిపోయింది.. 
కార్పొరేట్ చదువులకు తమ రక్తం అమ్మినా 
సరిపోదని వాపోతున్నారు.. 
కార్పొరేట్ స్కూళ్లతో జతకట్టిన ప్రభుత్వం.. 
సామాన్యుల జీవితాలను పీల్చి పిప్పి చేస్తోంది.. 
విజ్ఞానం కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది.. 
అజ్ఞానంతో ఓట్లేశామని ఇప్పుడు కుమిలిపోతున్నారు.. 
నీ కన్నీటికి నువ్వే సమాధానం చెప్పుకోలేని 
దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్నావు.. 
ఇది నువ్వు చేసిన తప్పే సోదరులారా.. 
మీ కన్నపేగును నువ్వే నరకంలోకి నెట్టేశావు.. 
ఇప్పటికైనా తెలుసుకో.. ఒక మనిషిగా 
మసులుకో.. విజ్ఞతతో నిర్ణయం తీసుకో.. 
- బోయినపల్లి రమణ..

Tags :