వారి వల్లనే ఓ నిండు ప్రాణం బలైంది..!

Updated:21/12/2017 01:02 PM

a person died due to heartache at vijayanagaram

ఆర్టీసీ డ్రైవర్, ఇద్దరు ఆటో డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఓ నిండు ప్రాణం బలైంది. సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో జరిగింది. అస్వస్థతతో ఉన్న వ్యక్తిని దారి మధ్యలో దించేసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్, గుండెనొప్పితో బాధపడుతున్న వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు నిరాకరించిన ఆటో డ్రైవర్లు ఒక నిండు ప్రాణం పోవడానికి కారకులయ్యారు. కళ్లముందే.. కన్నతండ్రి గుండెపట్టుకుని విలవిలలాడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ కుమారుడు పడిన బాధ వర్ణనాతీతం.

చూసిన వారు అయ్యో పాపం అన్నారే తప్ప వారికి మాత్రం సాయం చేసే పరిస్థితి లేదు. విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర డిసెంబర్ 20వ తేదీ (బుధవారం) జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

శ్రీకాకుళం టౌన్ బ్యాంకర్స్ కాలనీలో నివాసం ఉండే పొన్నాడ అచ్యుత్ (55) ఎల్ఐసీ ఏజెంట్. వారం రోజులుగా దగ్గుతో బాధపడుతున్నాడు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లేందుకు కుమారుడు విష్ణుతో బుధవారం ఆర్టీసీ బస్సు ఎక్కారు. భోగాపురం ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసరికి అచ్యుత్ అస్వస్థతకు గురయ్యాడు. ఛాతీ నొప్పి వస్తోందని కుమారుడికి చెప్పాడు.

దీంతో కుమారుడు విష్ణు వెంటనే ఆస్పత్రి దగ్గర్లో ఉంటే ఆపాలని కండక్టర్ను కోరాడు. అయితే చాకివలస కూడలి దగ్గరకు వచ్చేసరికి అచ్యుత్కు నొప్పి ఎక్కువ అయ్యింది. దీంతో కుమారుడు విష్ణు ఆందోళన పడ్డాడు. వేగంగా వెళ్లాలని డ్రైవర్ ను వేడుకున్నాడు. విష్ణు ఆందోళన అర్ధం చేసుకోవాల్సిన కండెక్టర్, డ్రైవర్ నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారు. బస్సును ఆస్పత్రికి తీసుకుపోకుండా మధ్యలోనే బస్సును ఆపేశారు.

నడిరోడ్డుపై బలవంతంగా దింపేశారు. దీంతో రోడ్డున వెళ్లే ఆటోల కోసం ప్రయత్నించాడు. ఏ ఆటో డ్రైవర్ కూడా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. ఓ ఆటో డ్రైవర్ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ముందుకు వచ్చాడు. కొంచెం దూరం తీసుకెళ్లిన తర్వాత.. అచ్యుత్ రావు పరిస్థితి గమనించి.. ఆ డ్రైవర్ కూడా మధ్యలోనే బలవంతంగా దింపేశాడు. నడిరోడ్డుపైనే కన్నకొడుకు చేతిలోనే.. ఆ తండ్రి చివరి శ్వాస విడిచాడు.

ఈ ఘటనకి కొద్దిదూరంలోనే ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. కిలోమీటరు దూరంలో ప్రభుత్వ ఆస్పత్రి ఉంది. బస్సు డ్రైవర్ బస్సును వెంటనే వెనక్కి తిప్పినా.. కనీసం ఆటో డ్రైవర్లు సమయానికి స్పందించినా ఓ నిండు ప్రాణం నిలబడేది. చుట్టూ ఎంతమంది ఉన్నా సాయం చేసేవారు లేకపోవడం మరింత విషాదం. సమాజంలో మనిషన్నవాడు మాయం అవుతున్నాడు అనేదానికి ఇదో నిదర్శనం కదా

సంబంధిత వార్తలు

నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన టీటీడీ ఉద్యోగులు

నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన టీటీడీ ఉద్యోగులు

మూడేళ్లుగా కూతురిపై తండ్రి అత్యాచారం

మూడేళ్లుగా కూతురిపై తండ్రి అత్యాచారం

అర్చకుల వివాదంపై టీటీడీ ఈవో వివరణ

అర్చకుల వివాదంపై టీటీడీ ఈవో వివరణ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

ఆన్‌లైన్‌లో 56,310 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు  విడుదల

ఆన్‌లైన్‌లో 56,310 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR