8 అంతస్తుల ఎత్తులో వచ్చిన రాకాసి అలను చూశారా..

Updated:11/05/2018 05:24 AM

8  floors  high  wave

ఇప్పటివరకు రికార్డయిన వాటిలో దక్షిణార్ధగోళంలో అతి పెద్దదైన రాకాసి అల ఇది. 23.8 మీటర్లు (78 అడుగుల) ఎత్తులో వచ్చిందీ అల. అంటే సుమారు ఓ 8 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు ఇది. దక్షిణ మహాసముద్రంలో పెను తుఫాను సందర్భంగా ఈ అల ఏర్పడింది. న్యూజిలాండ్‌కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో ఉండే క్యాంప్‌బెల్ దీవి సమీపంలో ఈ రాకాసి అల కనిపించినట్లు మెట్‌ఓషన్ సొల్యూషన్స్ సంస్థ వెల్లడించింది. 2012లో ఇదే దక్షిణార్ధ గోళంలో 22.03 మీటర్ల ఎత్తులో వచ్చిన అల రికార్డును ఇది బద్ధలు కొట్టింది. దక్షిణార్ధగోళంలో ఇదే అతిపెద్దదని ఓషనోగ్రాఫర్ టామ్ డ్యురాంట్ చెప్పారు. 

దక్షిణ మహాసముద్రం అతిపెద్ద అలలను సృష్టించే ఇంజిన్ రూమ్‌లాంటిదని, ఇవి భూగోళం మొత్తం వ్యాపిస్తాయని ఆయన తెలిపారు. ఇంతకన్నా పెద్ద కెరటాలు కూడా ఈ తుఫాను సందర్భంగా ఏర్పడి ఉండొచ్చని, అయితే వాటిని రికార్డు చేయలేకపోయామని డ్యూరాంట్ చెప్పారు. దక్షిణ మహాసముద్రంలో రాకాసి అలలను రికార్డు చేయడానికి ఓ యుద్ధనౌకను మార్చిలో అక్కడ ఉంచినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రపంచంలో వచ్చిన అతిపెద్ద రాకాసి అల ఎత్తు 30.5 మీటర్లు. అలస్కాలోని లితుయా బేలో 1958లో సునామీ సందర్భంగా ఈ అల ఏర్పడింది.