54 చేతులను నరికి బ్యాగులో ఉంచారు

Updated:11/03/2018 06:56 AM

54 hands was cut putted in bag

రష్యాలో ఒళ్లు గగుర్పొడిచే వార్త ఒకటి సంచలనం సృష్టిస్తోంది. అక్కడి సైబీరియా ప్రాంతంలో గల ఖబరోవ్క్‌ నగరంలో ఓ నది ఒడ్డున అనుమానాస్పద బ్యాగును పోలీసులు గుర్తించారు. దాన్ని తెరిచి చూడగా అందులో నరికిన 54 చేతులు కన్పించాయి. దీంతో ఒక్కసారిగా పోలీసులు షాక్‌కు గురయ్యారు. సైబీరియన్ ‌టైమ్స్‌ అనే మీడియా సంస్థ ఈ వార్తను ప్రచురించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అముర్‌ నది ఒడ్డున ఈ బ్యాగును గుర్తించారు. తొలుత మణికట్టు వరకు నరికిన ఒక చేయి కన్పించండంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు అక్కడికి చేరుకుని తనిఖీలు చేయగా నరికిన చేతులతో ఉన్న బ్యాగు కన్పించింది. అయితే ఆ చేతులు ఎవరివి? ఎలా అక్కడికి వచ్చాయి? అన్నది పోలీసులకు అంతుపట్టట్లేదు. ఆ చేతులకు ఆసుపత్రిలో చుట్టే బ్యాండేజీలు, ప్లాస్టిక్‌ గ్లౌజులు చుట్టి ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో పరిశోధనల నిమిత్తం వైద్యులే మరణించిన వారి నుంచి ఈ చేతులను నరికారా..? లేదా శిక్షల పేరుతో ఎవరైనా ఇలా చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒక చేతి మీద మాత్రమే వేలిముద్రలు కన్పించాయని మిగతా వాటి వేలిముద్రల కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. అముర్‌ నదీ ప్రాంతం ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. అందుకే చేతులు పూర్తిగా పాడవలేదని తెలుస్తోంది. మిస్టరీగా మారిన ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

మరుగుదొడ్డి నీటిలో పడి ఊపిరాడక నలుగురు మృతి..

మరుగుదొడ్డి నీటిలో పడి ఊపిరాడక నలుగురు మృతి..

ప్రియుడిపై కత్తితో యుద్దం చేసిన ప్రేయసి

ప్రియుడిపై కత్తితో యుద్దం చేసిన ప్రేయసి

ఓ విద్యార్థిని గొంతులో ఇడ్లీ చిక్కుకొని మృతి

ఓ విద్యార్థిని గొంతులో ఇడ్లీ చిక్కుకొని మృతి

హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు చిన్నారులు సహా భార్య, భర్తలు ఆత్మహత్య

హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు చిన్నారులు సహా భార్య, భర్తలు ఆత్మహత్య

టీవీ నటిపై అత్యాచారయత్నం

టీవీ నటిపై అత్యాచారయత్నం

సిబిఐ దొరికిన మరో డైమండ్‌ డైరెక్టర్‌

సిబిఐ దొరికిన మరో డైమండ్‌ డైరెక్టర్‌

లెక్చరర్ పై దారుణంగా కాల్పులు జరిపిన విద్యార్థి

లెక్చరర్ పై దారుణంగా కాల్పులు జరిపిన విద్యార్థి

ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో భారీ దోపిడి

ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో భారీ దోపిడి

Latest Videos

You Tube Image

నటి భానుప్రియ ఇంట విషాదం | Heroine BhanuPriya Husband Passed Away | Adabhyderabad News