అమెజాన్‌ను మోసం చేసిన నలుగురు అరెస్ట్

Updated:13/04/2018 02:53 AM

4 people of amazon who has cheated  got arrested

అమెజాన్ సంస్థను మోసం చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఫోన్లు తీసుకుని తమకు రాలేదంటు నిందితులు పేర్కొంటూ.. మళ్లీ ఫోన్లు పంపించాలని అమెజాన్‌కు ఆర్డర్లు చేశారు. అనుమానం వచ్చి అమెజాన్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్‌క్రైమ్ డీసీపీ జానకీ షర్మిలా ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 10.75 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. 556 సిమ్‌కార్డులు, 42 సెల్‌ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.