నలుగురు మృతి దిల్లీలో అగ్నిప్రమాదం

Updated:13/04/2018 12:41 PM

4 members died in delhi due to fire accident

రాజధాని దిల్లీ నగరంలో విషాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వాయువ్య దిల్లీలోని కొహాట్‌ ఎన్‌క్లేవ్‌లోని నాలుగంతస్థుల భవనంలో మంటలు చెలరేగి ప్రమాదానికి కారణమయ్యాయి. నలుగురు చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. తెల్లవారుజామున 2.48 ప్రాంతంలో భవనం పార్కింగ్‌ ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు తమకు ఫోన్‌ వచ్చిందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని పది అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలు అదుపులోకి తీసుకొచ్చామని అధికారులు వెల్లడించారు.

మొదటి అంతస్థులోని తమ ఫ్లాట్‌లో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు నిద్రిస్తున్నారు. కింద నుంచి పొగలు వెలువడుతున్నట్లు గమనించిన వారు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ పొగలు విపరీతంగా అలుముకోవడంతో ఊపిరాడక చనిపోయారని అధికారులు తెలిపారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

సంబంధిత వార్తలు

ఎయిర్ అంబులెన్స్..

ఎయిర్ అంబులెన్స్..

కర్రీ పాయింట్‌లో కొన్న దొండకాయ కూరలో బొద్దింకలు.

కర్రీ పాయింట్‌లో కొన్న దొండకాయ కూరలో బొద్దింకలు.

అమాయకులపై దాడుల నేపథ్యంలో సీపీ సమీక్ష

అమాయకులపై దాడుల నేపథ్యంలో సీపీ సమీక్ష

ఓయూసెట్ 2018 ఎంట్రేన్స్ పరీక్ష తేదీలు ఇవే

ఓయూసెట్ 2018 ఎంట్రేన్స్ పరీక్ష తేదీలు ఇవే

మూసాపేట హత్యకేసు మిస్టరీ ఛేదించిన పోలీసులు

మూసాపేట హత్యకేసు మిస్టరీ ఛేదించిన పోలీసులు

సీబీఐటీలో సీట్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు

సీబీఐటీలో సీట్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు

మారిన మెట్రో అంచనాలు

మారిన మెట్రో అంచనాలు

సాయంత్రం బెంగళూరు వెళ్లనున్న సీఎం కేసీఆర్

సాయంత్రం బెంగళూరు వెళ్లనున్న సీఎం కేసీఆర్

Latest Videos

You Tube Image

Komati Reddy on KCR