ఆధార్‌కు తుది గడువు లేదు: సుప్రీం

Updated:13/03/2018 05:18 AM

2nd time is not available for aadhar

ఆధార్‌ కార్డ్‌ తుది గడువుపై సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. బ్యాంకులు, మోబైల్‌ నంబర్లతో ఆధార్‌ అనుసంధానానికి 'మార్చి 31 తుదిగడువు అంటూ జరుగుతోన్న ప్రచారంపై స్పష్టత ఇచ్చింది. తుది తీర్పు వచ్చే వరకు ఏలాంటి తుది గడువులు లేవని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ బెంచ్‌కు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ మాట్లాడుతూ ఆధార్‌ తప్పనిసరంటూ కేంద్రం బలవంతం చేయడంతో తగదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలో వచ్చిన తదనంతరం అన్నింటికి ఆధార్‌ తప్పనిసరి చేయడం ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంక్‌, మోబైల్‌ అన్ని ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం అనేది తప్పనిసరి అయింది. దీంతో సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలు చేశారు. మొదట తుది గడువు ఫిబ్రవరి 28గా ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ మార్చి 31అని ప్రకటించారు. దీనిపై ఆందోళన చందుతున్న సమయంలో సుప్రీం తాజా ఆదేశాలు వెలువరించనుంది.