టెన్త్ సఫ్లిమెంటరీ ఫీజు 21లోపు చెల్లించాలి

Updated:12/05/2018 09:44 AM

10th supplementary fee should be paid before 21st

పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ నెల 21వ తేదీలోపు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజును చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ నెల 22వ తేదీలోపు ఎస్‌బీఐ ట్రెజరీలో ఫీజు చెల్లించాలని, 24వ తేదీ నాటికి డీఈవో కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను సమర్పించాలని డీఈఓ సూచించారు. రూ.50 అపరాధ రుసుంతో పరీక్ష రాయడానికి రెండురోజుల ముందుగా ఫీజు చెల్లించాలని తెలిపారు. మూడు సబ్జెక్టులు, అంతకన్నా తక్కువగా ఉంటే రూ.110, మూడు సబ్జెక్టుల కంటే ఎక్కువ ఉంటే రూ.125 పరీక్ష ఫీజులను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష ఫీజును 0202-ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఆర్ట్స్ కల్చర్, 01-జనరల్ ఎడ్యుకేషన్, 102-సెకండరీ ఎడ్యుకేషన్, 06-డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, డీడీఓ కోడ్-25000303001 హెడ్ ఆఫ్ అకౌంట్స్‌లలో మాత్రమే ఫీజులను చెల్లించాలని డీఈవో తెలిపారు.