దీపావళికి మెగా సర్‌ప్రైజ్‌..

దీపావళికి మెగా సర్‌ప్రైజ్‌..


చిరంజీవి ప్రస్తుతం ఫలితం ఎలా ఉన్నా వరుసగా సినిమాలను చేస్తూ అభిమానుల్లో జోష్‌ నింపుతున్నాడు. ఈ ఏడాది ‘ఆచార్య’తో శుభారంభం దక్కకపోయినా.. ఇటీవలే విడుదలైన ‘గాడ్‌ఫాదర్‌’తో తిరిగి హిట్‌ ట్రాక్‌లోకి వచ్చాడు. మొహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్ళను రాబడుతుంది. ఇక ప్రస్తుతం చిరంజీవి మూడు సినిమాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్ సినిమా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రీలుక్‌ పోస్టర్‌లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమా టైటిల్‌ను దీపావళి సందర్భంగా చిత్రబృందం ప్రకటించనుందట. అంతేకాకుండా మెగాస్టార్ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేయనున్నారట. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది. ఈ చిత్రంలో చిరంజీవి యూనియన్‌ లీడర్‌గా కనిపించనున్నాడట. ర‌వితేజ సిన్సియర్‌ పోలీస్‌ ఆధికారి పాత్రలో నటించనున్నాడట. ఈ సినిమాలో చిరుకు జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ యెర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విక్ట‌రి వెంక‌టేష్‌ గెస్ట్ రోల్ కూడా ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tags :