‘ఆర్ట్‌ ఆఫ్‌ రన్నింగ్‌ బెట్వీన్‌ ది వికెట్స్‌’

0

న్యూఢీల్లీ :క్రికెట్‌ అంటే జెంటిల్మెన్‌ గేమ్‌. ప్రతి క్షణం ఉత్కంఠగా సాగుతూ అభిమానులను మునివేళ్లపై నిల్చోబెడుతుంది. అయితే, అందులోనూ కొన్నిసార్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వించే సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా ఇంగ్లాండ్‌లోని కౌంటీ క్రికెట్‌లో భాగంగా సోమర్‌సెట్‌, సర్రే జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. బ్యాటింగ్‌ చేస్తున్న సోమర్‌సెట్‌ బ్యాట్స్‌మన్‌ లాంగాఫ్‌ మీదుగా బంతిని తరలించాడు. నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ మార్కస్‌ ట్రెస్కోటిక్‌ పరుగు తీయడం ప్రారంభించాడు. మూడు పరుగులు చేయాలన్న తొందరలో ట్రెస్కోటిక్‌ రెండు సార్లు కిందపడ్డాడు. మొదటి పరుగు పూర్తి చేసే క్రమంలో కాలు జారడి కిందపడ్డ ఆ బ్యాట్స్‌మెన్‌ మళ్లీ లేచి మరో పరుగు పూర్తి చేశాడు. మూడో పరుగు కోసం వచ్చే ప్రయత్నంలో మరోసారి కాలు జారి కిందపడ్డాడు. దీంతో అక్కడితో ఆగిపోయి మూడో పరుగు తీయలేదు. అయితే, మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ మాత్రం దాదాపు అవతలి ఎండ్‌కు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చేశాడు. పడుతూ లేస్తూ పరుగెత్తిన ట్రెస్కోటిక్‌ను చూసి మైదానంలో ఉన్న అంపైర్‌, ఫీల్డర్లు అంతా నవ్వడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకెల్‌ వాన్‌ కూడా ఈ వీడియోను షేర్‌ చేశాడు. ‘ఆర్ట్‌ ఆఫ్‌ రన్నింగ్‌ బెట్వీన్‌ ది వికెట్స్‌’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో రాసుకొచ్చాడు. 43 ఏళ్ల ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్‌ మార్కస్‌ ట్రెస్కోటిక్‌ 1993లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 26వేలకు పైగా పరుగులు చేశాడు. ప్రస్తుతం సోమర్‌సెట్‌ తరఫున 27వ సీజన్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here