మిసైల్స్‌ పనిలో ఆర్మీ

0
  • సన్నాహకంలో భారత్‌

పాకిస్థాన్‌ దేశాలు సరిహద్దులో యుద్ధ సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. అమ్ములపొదిలోని అస్త్రాలను భారత్‌ పరీక్షిస్తోంది. గత నెల చివరి వారంలో బాలాకోట్‌ లో ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేసిన తర్వాత.. తన వద్ద ఉన్న అస్త్రాలను భారత్‌ వరుసగా పరీక్షిస్తోంది. ఉపరితలం నుంచి.. గగన తలంలో శత్రు లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యమున్న ”క్విక్‌ రియాక్షన్‌ సర్‌ ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్స్‌ (ఖిఖీూంఓ)”

రాకెట్లను ఇప్పటికే ప్రయోగించి పరీక్షించింది.

అభినందన్‌ ను శాంతిదూతగా పంపిస్తున్నామని చెప్పిన పాకిస్థాన్‌.. ఆ మాటకు విలువివ్వకుండా కశ్మీర్‌ బోర్డర్‌లో కవ్వింపు కాల్పులు చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. పాకిస్థాన్‌ దాడులను తిప్పికొట్టేందుకు సైన్యాన్ని అప్రమత్తం చేసింది భారత్‌. శుక్రవారం రాత్రి పూంచ్‌ జిల్లాలో పాకిస్థాన్‌ మోర్టార్‌ దాడులతో సరిహద్దు ప్రజలను టార్గెట్‌ చేయడంతో.. కొన్ని గ్రామాలను భారత సైన్యం ఖాళీచేయించింది. స్కూళ్లను మూసివేయించింది. భారీస్థాయిలో ఆయుధాలతో దూసుకొస్తున్న మిలటరీ వాహనాలను ధ్వంసం చేయగలిగే సత్తా ఉన్న ‘యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్స్‌’ ను సైన్యపు తూర్పు కమాండ్‌ పరీక్షించింది. సైనిక బృందాలు ఫైరింగ్‌ ఎక్సర్‌ సైజ్‌ నిర్వహించాయి. అనుకున్న లక్ష్యాలను యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిసైల్స్‌ ఛేదించగలిగాయని అధికారులు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here