Featuredరాజకీయ వార్తలు

పొమ్మనలేక పొగబెడుతున్నారా..?

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ జనసమితి (తెజస)లో సీట్ల వ్యవహారం వేడెక్కింది. 8-9 సీట్లను తెజసకు కేటాయిస్తామని కాంగ్రెస్‌ పార్టీ లీకులిస్తోందంటూ తెజస కోర్‌ కమిటీ తీవ్రస్థా యిలో మండిపడింది. కనీసం 12-15 సీట్లకన్నా తక్కువగా కేటాయిస్తే ఒంటరిగా గానీ.. కలిసివచ్చే ఇతర పార్టీలతో గానీ ఎన్నికల బరిలోకి వెళ్దామనే తీర్మానాన్ని కోర్‌ కమిటీ ప్రతిపాదించింది. మహా కూటమిలో భాగస్వామ్య పార్టీలకు సీట్ల విషయమై స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్‌ పార్టీ జాప్యం చేయడంపై ఆది, సోమవారాల్లో జరిగిన తెజస కోర్‌ కమిటీ సమావేశంలో అసంతప్తి వ్యక్తమైంది. ఈ లెక్కలేవీ తేలకుండానే తమ పార్టీ అభ్యర్థులను ఒకటో తేదీన ప్రకటిస్తామని కాంగ్రెస్‌ వెల్లడించడాన్ని తప్పుబట్టింది. తెజస తరఫున దాదాపు 36 మంది ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతుండగా.. అన్ని సీట్లు రావని ఇప్పటికే తేలినందున అభ్యర్థులు కోర్‌ కమిటీ సమావేశంలో అధినేత ముందు తమ అసంత ప్తిని వ్యక్తం చేశారు. అంతేకాదు తెజస కోరుకునే మహాబూబ్‌నగర్‌, ముథోల్‌, జడ్చర్ల, మిర్యాలగూడ, వరంగల్‌ ఈస్ట్‌, మల్కాజిగిరి, పెద్దపల్లి, ఆశ్వరావుపేట, నాంపల్లి, రామగుండం, అంబర్‌ పేట, ఖైరతాబాద్‌, మహాబూబాబాద్‌, మలక్‌ పేట, జూబ్లీహిల్స్‌ స్థానాల గురించి మాట్లాడకుండా కోరుకోని మలక్‌పేట, చాంద్రాయ ణగుట్ట వంటి స్థానాలను చేర్చడంపై కోర్‌ కమిటీ భగ్గుమంది. మిర్యాలగూడ స్థానాన్ని ఇవ్వాలని కోదండరాం స్వయంగా కోరినా.. ఆ స్థానాన్ని ఇవ్వకపోగా కోరుకోని స్థానాలను అంటగ ట్టాలనుకోవడం సరైన ధోరణి కాదని తప్పుబ ట్టింది. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం తదితర ఉమ్మడి జిల్లాల నుంచి తెజసకు ఒక్క సీటును కూడా సర్దుబాటు చేయకపోవడంపైనా చర్చించినట్లు తెలిసింది. మరో రెండు రోజుల పాటు కాంగ్రెస్‌ నుంచి స్పష్టమైన సమాచారం వస్తుందే మో వేచిచూసి.. అనంతరం తాము కోరుకున్న స్థానాలు దక్కని పరిస్థితులు ఎదురైతే.. సొంతంగానే కనీసం 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కోర్‌ కమిటీలో సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి ప్రయోజనం కోసం కొన్ని సీట్లు వదులుకొనేందుకు భాగస్వామ్యపక్షాలు సిద్ధపడు తున్నా కూటమికి తూట్లు పొడిచే విధంగా కొందరు నేతలు ప్రచారం నిర్వహించడంపై వివిధ పార్టీల నేతలు ముఖ్యంగా సీపీఐ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. టీజేఎస్‌ కనీసం 15 నుండి 20 సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని నిర్ణయం తీసుకొంది. ఉద్దేశ్యపూర్వకంగానే కాంగ్రెస్‌ పార్టీ సీట్ల సర్దుబాటు విషయాన్ని తేల్చడం లేదని టీజేఎస్‌ కోర్‌ కమిటీ అభిప్రాయపడింది. అంతేకాదు కాంగ్రెస్‌ పార్టీ సీట్ల సర్దుబాటు విషయంలో సాచివేత ధోరణిని అవలంభిస్తే సీపీఎం నేత త్వంలోని బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌తో చర్చించాలని కూడ టీజేఎస్‌ కోర్‌ కమిటీ లో కొందరు అభిప్రాయపడ్డారు. బీఎల్‌ఎఫ్‌ టీజేఎస్‌ కు కనీసం 8 సీట్లు ఇచ్చేందుకు సంసిద్దతను వ్యక్తం చేసిన విషయాన్ని కొందరు నేతలు ఈ సమావేశంలో గుర్తు చేశారు. ఇదిలా ఉంటే ఈ రెండు కూటములు సాధ్యం కాకపోతే బీజేపీతో జత కట్టాలనే చర్చ కూడ సాగింది. అయితే టీజేఎస్‌ లో ఎక్కువ లెఫ్ట్‌ భావజాలం ఉన్నవారున్నందున… చివరి ఆఫ్షన్‌ గా బీజేపీని ఎంచుకొన్నారు. టీజేఎస్‌ చీఫ్‌ కోదండరామ్‌ సమక్షంలోనే కోర్‌ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా తేల్చి చెప్పారు. అయితే సభ్యుల అభిప్రాయా లను పరిగణనలోకి తీసుకొన్న కోదండరామ్‌… కాంగ్రెస్‌ పార్టీ వద్ద మన డిమాండ్లను ఉంచుతానని కోర్‌ కమిటీలో తేల్చిచె ప్పినట్టు సమాచారం. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ పార్టీ నేతలు మహా కూటమిలోని పార్టీలతో కాంగ్రెస్‌ నేతలు చర్చించారు. మహాకూటమిలోని పార్టీలు కోరినన్ని సీట్లు ఇవ్వలేమని కాంగ్రెస్‌ పార్టీ తేల్చి చెప్పినట్టు సమాచారం. టీడీపీకి 9, టీజేఎస్‌ కు 3, సీపీఐకి 2 సీట్లు ఇస్తామని కాంగ్రెస్‌ స్పష్టం చేసినట్టు సమాచారం.సోమవారం నాడు స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రజా కూటమిలోని పార్టీ నేతలకు సమాచారాన్ని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ ప్రతిపాదనపై టీజేఎస్‌, సీపీఐ నేతలు తీవ్ర అసంత ప్తితో ఉన్నారని సమాచారం.

దీంతో కాంగ్రెస్‌ నేతలు సీపీఐ, టీజేఎస్‌ నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. టీజేఎస్‌ చీఫ్‌ కోదండరామ్‌ కు డిప్యూటీ సీఎం లేదా రాజ్యసభ సీటు, సీపీఐ నేతలకు కీల కమైన కార్పోరేషన్లకు ఛైర్మెన్‌ పదవులు ఇవ్వాలని ప్రతిపా దించినట్టు సమాచారం. అయితే ఈ విషయమై కాంగ్రెస్‌ ప్రతి పాదనపై సీపీఐ, టీజేఎస్‌ నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్‌ ను ఓడించాలనే లక్ష్యంతో తా ము పనిచేస్తున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. తమకు సీట్లు ముఖ్యం కాదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close