పెద్దల సభలోను ఆమోదం

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): లోక్‌సభలో మంగళవారం నాడు తిరుగులేని మెజార్టీతో ఆమోదం పొందిన ఈబీసీ బిల్లు బుధవారం నాడు రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. పెద్దల సభలో ఏడు గంటల పాటు సాగిన చర్చలో విపక్షాలు ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపుతూ ఎన్డీయే కూటమి రిజర్వేషన్‌ బిల్లును తెచ్చిందని విపక్షాలు మండిపడ్డాయి. బిల్లు ఉద్దేశం మంచిదే అయిన ఎలా అమలు చేస్తారో చెప్పడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని న్యాయస్థానం ముందు ఈ బిల్లు నిలువలేదని వాదించాయి. ఇంత హరీవురీగా హాడావుడిగా బిల్లును తీసుకువచ్చే కన్నా మరింత సమయం కేటాయించి కూలకశంగా చర్చించేందుకు వీలు కల్పిస్తే కొందరు నాయకులు సూచించారు. బిల్లును ఎట్టిపరిస్థితుల్లోను సెలక్ట్‌ కమిటికి పంపాల్సిందేనని పట్టుబట్టింది. అధికార పక్షం తీరస్కరించడంతో సెలక్ట్‌ కమిటి ప్రతిపాదన వీగిపోయింది. ప్రతిపక్షాల డిమాండ్‌ మేరకు బిల్లుపై ఓటింగ్‌ జరిపించగా అనుకూలంగా 165, వ్యతిరేకంగా 7 ఓట్లు వచ్చాయి. బిల్లుపై విపక్షాలు చేసిన పలు సవరణలు కూడా వీగిపోయాయి. బుధవారం కేంద్రమంత్రి థావర్‌చంద్‌ గ¬్లత్‌ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసమే ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అందుతాయన్నారు. ‘సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌’ నినాదం పరిపూర్ణం చేయడానికే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పారు. సామాజిక సమానత్వం కోసమే ఈనిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని పట్టుబట్టాయి. ఈ సందర్భంగా బిల్లులో కొన్ని సవరణలు చేయాలని డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, డీఎంకే సభ్యులు పోడియం వద్ద నిరసనకు దిగారు.బిల్లుకు తాను సవరణ ప్రతిపాదిస్తున్నట్లు డీఎంకే సభ్యురాలు కనిమొళి ప్రకటించగా, చైర్మన్‌ అందుకు అంగీకరించలేదు. దీంతో బిల్లును వెంటనే సెలెక్ట్‌ కమిటీకి పంపాలని డీఎంకే, సీపీఐ డిమాండ్‌ చేశాయి. కాగా, ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. అయితే బిల్లును ఈరోజే ఆమోదించాల్సిన అవసరం లేదనీ, దీనిపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఈ బిల్లుపై చర్చకు దూరంగా ఉండాలని బిహార్‌ కు చెందిన రాష్టీయ్ర జనతాదళ్‌ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రాజ్యసభను ఒకరోజు పొడిగించడంపై సభ్యులు అభ్యంతరం తెలిపారు. చివరికి సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్‌ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

రాజ్యసభ పొడిగింపుపై విపక్షాల మండిపాటు..

ముందస్తు సమాచారం లేకుండా సభను ఎలా పొడగిస్తారంటూ సభలో సభ్యులు ఆందోళనలు చేపట్టారు. పొడిగింపుపై ఏకగ్రీవ తీర్మానం లేకుండా ఎలా కొనసాగిస్తారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ ప్రశ్నించారు. రాజ్యసభలో ఇప్పటివరకూ రఫేల్‌ సహా తాము డిమాండ్‌ చేస్తున్న అంశాలపై ఇంతవరకూ చర్చ జరగలేదని అన్నారు. అయితే బీఏసీ సమావేశంలోనే రాజ్యసభ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నామని, ఈ సమావేశానికి చాలా మంది విపక్ష సభ్యులు హాజరయ్యారని.. డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. అయితే, అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు వీలు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు, ముమ్మారు తలాక్‌ బిల్లు వంటి కీలక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉన్నందునే సభను పొడిగించామని కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ చెప్పారు. సభ పొడిగించడాన్ని దేశం మొత్తం కోరుకుంటోందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆందోళన చేస్తున్న సభ్యులతో అన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here