కొలువుదీరిన ఏపీ హైకోర్టు

0
  • ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణం
  • ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న గవర్నర్‌, ఏపీ సీఎం

అమరావతి, జనవరి1(ఆర్‌ఎన్‌ఎ) : ఆంధప్రదేశ్‌ హైకోర్టు కొలువుదీరింది. హైకోర్టు తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆంధప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గవర్నర్‌ నరసింహన్‌ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు 13 మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు పాల్గొన్నారు.

ఏపీ విభజన నేపథ్యంలో 62ఏళ్ల తర్వాత సోమవారం అమరావతికి హైకోర్టు తరలివెళ్లింది. దీంతో రాష్ట్రంలో చారిత్రక ఘటం ఆవిష్కృతమైంది. 2018 డిసెంబరు 26న ఉమ్మడిహైకోర్టు విభజన నోటిఫికేషన్‌ వెలువడింది. దీంతో నేటి నుంచి అమరావతి కేంద్రంగా ఏపీ రాష్ట్ర హైకోర్టు విధులు ప్రారంభమయ్యాయి. ఉమ్మడిహైకోర్టులో 3.4లక్షల వ్యాజ్యాలు ఉండగా.. అందులో 70శాతం వరకు కేసులు ఏపీకి చెందినవే. ఏపీ హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు 37 కాగా… ప్రస్తుతం ఉన్న వారు 14 మంది. ఇదిలా ఉంటే.. విజయవాడ నడిబొడ్డున ఉన్న సీఎం క్యాంపు కార్యాలయంలోనే కొన్నాళ్ల పాటు హైకోర్టు కార్యకలాపాలు జరుగనున్నాయి. ఇందులో తొమ్మిది కోర్టుహాళ్లు సిద్ధం చేశారు. మరో హాలును మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆంధప్రదేశ్‌కు కేటాయించిన న్యాయమూర్తులంతా సోమవారం సాయంత్రానికే హైదరాబాద్‌ నుంచి విజయవాడకు చేరుకున్నారు. వారికి ప్రముఖ ¬టళ్లు, స్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో వసతి ఏర్పాటు చేశారు. సిబ్బంది నాలుగు బస్సులలో విజయవాడకు వచ్చేశారు.

ప్రమాణ స్వీకారం చేసిన 13మంది న్యాయమూర్తులు వీరే..

జస్టిస్‌ వెంకట నారాయణభట్టి, జస్టిస్‌ వెంకట శేషసాయి, జస్టిస్‌ సీతారామమూర్తి, జస్టిస్‌ దుర్గా ప్రసాదరావు, జస్టిస్‌ సునీల్‌చౌదరి, జస్టిస్‌ సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ శ్యాంప్రసాద్‌, జస్టిస్‌ ఉమాదేవి, జ

స్టిస్‌ బాలయోగి, జస్టిస్‌ రజని, జస్టిస్‌ సుబ్రహ్మణ్య సోమయాజులు, జస్టిస్‌ విజయలక్ష్మి, జస్టిస్‌ గంగారావులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here