నేటినుంచి ఎపి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

0

అమరావతి,జనవరి29(ఆర్‌ఎన్‌ఎ): ఎపి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి జరగనున్నాయి. త్వరలోనే జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇవే చివరి సమావేశాలు కానున్నాయి. ఓట్‌ అన్‌ ఆకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలతో చంద్రబాబు ప్రభుత్వం చివరి బడ్జెట్‌ సమర్పించబోతున్నది. ఏపీ అసెంబ్లీ సమవేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. 30న గవర్నర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1,2,3 తీదీల్లో అసెంబ్లీకి సెలవు అని ప్రకటించారు. అనంతరం ఫిబ్రవరి 4న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం.. 5న ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశం.. 6 నుంచి 8 వరకూ బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల కోసం

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రూరల్‌ ఎస్పీ రాజశేఖర్‌ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన బందోబస్తు ఏర్పాట్లను సవిూక్షించారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పది కిలోవిూటర్ల వరకు మేరకు 30 పోలీస్‌ యాక్ట్‌తో పాటు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని అన్నారు. ఎటువంటి సభలు, సమావేశాలు, నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, ప్లేకార్డుల ప్రదర్శన నిషిద్దం అన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామన్నారు. వాహన రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పార్కింగ్‌ ప్రదేశాల్లో ఎటువంటి ఇబ్బందులు తలె త్తకుండా మార్కింగ్‌ చేయించి సైన్‌ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అసెంబ్లీ, చుట్టు పక్కల ప్రాంతాల్లో గరుడ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, డ్రోన్‌ కెమెరాల ద్వారా నిరంతరం పర్య వేక్షిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, భద్రతా అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అర్బన్‌ పరిధిలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అర్బన్‌ ఎస్పీ విజయరావు ఆదేశించారు. ఇప్పటికే అర్బన్‌ పరిధిలో 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉన్నందున అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు నిషేదం అన్నారు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాల్లో ప్రత్యేక పికెట్‌లు ఏర్పాటు చేసినట్లు అర్బన్‌ ఎస్పీ విజయరావు తెలిపారు.

వైకాపా బహిష్కరణ సరికాదు

తెదేపాకు ప్రత్యామ్నాయం తానే అని చెప్పుకుంటున్న ప్రధాన ప్రతిపక్షం వైకాపా ప్రజా సమస్యలను గాలికొదిలేసిందనీ, శాసనసభా సమావేశాలను బహిష్కరించడం ద్వారా ప్రజల పట్ల తమ బాధ్యతను విస్మరించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. సమావేవౄలకు హాజరై ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాల్సిన విపక్షం అసెంబ్లీకి హాజరు కాకపోవడం సరికాదన్నారు. అలాగే రాష్ట్రానికి ద్రోహం చేయడమే కాకుండా మైనార్టీ వర్గాల పట్ల దాడులను ప్రోత్సహిస్తున్న భాజపా పట్ల వైకాపా మెతక వైఖరి అవలంబించడం దారుణమని అన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో టీఆర్‌ఎస్‌తో కలిసి ప్రత్యేక ¬దా సాధిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెదేపా, వైకాపాకు ప్రత్యామ్నాయంగా జనసేన, సీపీఎం, సీపీఐలు కొత్తశక్తిగా ప్రజల్లోకి వెళ్లాలనుకోవడం శుభపరిణామమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో విఫలమైన తెదేపా, వైకాపాలకు ప్రత్యామ్నాయంగా నూతన రాజకీయ శక్తితో ప్రజల్లోకి వెళ్లనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చడంలో తెదేపా ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు. నాలుగన్నర సంవత్సరాలుగా వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యల కోసం చేస్తున్న పోరాటాలను అణచివేసిందనీ, వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులను భర్తీ చేయలేకపోయిందన్నారు. రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారిమళ్లించి ఉపాధిహావిూ పథకం కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలు లేకుండా చేశారన్నారు. ప్రతి నిత్యం పోలవరం జపం చేస్తున్న ముఖ్యమంత్రి లక్షలాది ఆదివాసీ నిర్వాసితుల పునరావాసం గురించి పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను గుర్తించి పింఛన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు పసుపు, కుంకుమల పేరుతో రూ.10వేలు, సెల్‌ఫోన్లు, ఆటోలు, ట్రాక్టర్లకు పన్ను మినహాయింపు వంటి కొత్త పథకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రజలను ఆకట్టుకోవాలని చూడడం అవివేకమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here