ఓడిపోతున్నందుకే ఆందోళన

0

˜ దీదీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు

˜ రాష్ట్రాభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నారు

˜ బీజేపీ ర్యాలీలను అడ్డుకుంటున్నారు

˜ బహిరంగ సభలో ప్రధాని మోడీ

కోల్‌కతా : దేశ రాజ్యాంగాన్ని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అవమానిస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. గురువారం బెంగాల్‌లోని బంకురాలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అసహనంతో ఉన్న దీదీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నదని, తనను ప్రధానిగా ఆమె గుర్తించడం లేదని మోడీ అన్నారు. కానీ పాక్‌ ప్రధానిని మాత్రమే ఆమె ప్రధానిగా భావిస్తున్నాని మోడీ ఆరోపించారు. ఈ దేశ ప్రధానమంత్రిని దేశ అధినేతగా తాను ఒప్పుకోనంటూ బహిరంగంగా చెబుతూ మమతా బెనర్జీ మన రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతున్నందుకే ఆమె ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. తుపాన్‌ వచ్చినప్పుడు ఫోను చేస్తే ఆమె స్పందించలేదని, రాష్ట్ర అధికారులతో కేంద్ర ప్రభుత్వం తుపానుపై చర్చించాలనుకుందన్నారు. కానీ, దీదీ ఇందుకు కూడా ఒప్పుకోలేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం ఆమెకు ఇష్టం లేదని మోడీ అన్నారు. నాపై రాళ్లు, చెంప దెబ్బలతో దాడి చేసే అంశంపై మాత్రం ఆమె మాట్లాడుతున్నారన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను నేను ఎదుర్కోగలనని, ప్రపంచంలోని అన్ని నిఘంటువుల్లో ఉన్న పదాలతో నన్ను తిట్టినా నేను ఎదుర్కోగలనని మోడీ అన్నారు. రాష్ట్రంలో భాజపా నిర్వహించే ర్యాలీలను అడ్డుకోవాలని టీఎంసీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కానీ, విూ ఆశీర్వాదాలు నాకు ఉన్నంత వరకు ఎవ్వరూ నన్ను ఇక్కడకు రాకుండా ఆపలే రని మోడీ వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల మమత మాట్లాడుతూ.. ‘మోడీకి ప్రజాస్వామ్య దెబ్బ రుచి చూపిస్తా అంటూ వ్యాఖ్యానించారు. అదేవిధంగా కొద్దిరోజుల్లో దిగిపోయే మోడీని ప్రధానిగా నేనే ఒప్పుకోనంటూ మమత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌ బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here