Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

కాశ్మీర్‌లో పుల్వామా తరహా మరో ఉగ్రదాడికి కుట్ర..

పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..

  • బాలాకోట్‌లో 500 మంది ఉగ్రవాదులు

సరిహద్దులో మరో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారా? పుల్వామా తరహాలో దాడులకు ప్లాన్‌ వేశారా? అంటే తాజా పరిణామాలు అవుననే జవాబిస్తున్నాయి. సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని కథువా ప్రాంతంలోని దెవాల్‌ గ్రామంలో 40 కిలోల భారీ పేలుడు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దులో దాడికి ఉగ్రవాదులు ప్లాన్‌ వేస్తున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో సరిహద్దు భద్రత బలగాలు కొద్దిరోజులుగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ తనిఖీల్లో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు దొరకడం సంచలనం సృష్టించింది. సరిహద్దు ద్వారా 500 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ చెప్పిన కొన్ని నిమిషాల్లోనే పేలుడు పదార్థాలు దొరకడం గమనార్హం. బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలు మళ్లీ ఇటీవల యాక్టివేట్‌ అయ్యాయని, దాయాది దేశం వీటిని యాక్టివేట్‌ చేసిందని రావత్‌ వెల్లడించారు. చెన్నైలోని ఆఫీసర్‌ ట్రెయింగ్‌ అకాడవిూలో కొత్త బ్యాచ్‌ శిక్షణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన.. సరిహద్దుల్లో భారీగా సైనికులను మోహరించామని, బాలకోట్‌ దాడులకు మించి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో ఏమాత్రం సంకోచించబోమని స్పష్టం చేశారు.

బాలాకోట్‌లో 500 మంది ఉగ్రవాదులు: ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌

బాలాకోట్‌ లో సుమారు 500 ఉగ్రవాదులు ఉన్నట్లు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. సోమవారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పుల్వామా దాడి తర్వాత భారత దళాలు పాక్‌లోని బాలాకోట్‌ ఉగ్రస్థావరాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే అదే స్థావరం వద్ద మళ్లీ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను పునరుద్దరించినట్లు ఆర్మీ చీఫ్‌ స్పష్టం చేశారు. బాలాకోట్‌ స్థావరంపై మరోసారి సర్జికల్‌ దాడి చేసినా ఆశ్చర్యం లేదని రావత్‌ తెలిపారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని, బాలాకోట్‌ దాడి కన్నా మరింత బలమైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సుమారు 500మంది ఉగ్రవాదులు ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. కశ్మీర్‌లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. వ్యాలీలో ఉగ్రవాదులు అల్లర్లు సృష్టించాలనుకుంటున్నారన్నారు. కశ్మీర్‌లో విధించిన ఆంక్షలను నెమ్మదిగా ఎత్తివేస్తామన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close