బిజినెస్

మహిళా మూర్తులకు మొబైల్‌ యాప్‌లో మరో ప్రపంచం!

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సాధారణంగా ఒక గహిణికి ఇల్లే ప్రపంచం, పెళ్లయ్యి ఉద్యోగం చేస్తున్నవాళ్ళకి ఇల్లు, ఆఫీసు.. అసలు సమయమే దొరకదు. ఎటువంటి దశలో ఉన్న మహిళకైనా వారి అవసరాలకు తగ్గట్టు, అన్నిరకాలుగా ఉపయోగపడే సమస్త సమాచారం అందించే ఒక సాధనం! ఒక మహిళ అవసరాలు, సమస్యలు సాటి మహిళకే తెలుస్తాయి… అలాంటి మహిళల మనోభావాలను అనుసరిస్తూ తమ అభిప్రాయాలు/ సమస్యలను ఇతర మహిళలతో నిస్సందేహంగా పంచుకోగలిగే సురక్షిత వేదిక! అంతేనా, ఎన్నో కలలున్నా, కళలు తెలిసినా ఇంటికే పరిమితమైపోతున్న సగటు గ హిణి తన ట్యాలెంట్‌ పదిమందికి ప్రదర్శించుకోవడమే కాదు తనకు తెలిసింది నలుగురికీ నేర్పిస్తూ పేరుతో పాటు ఇంటినుంచే డబ్బు కూడా సంపాదించుకోగలిగే అవకాశాలు ఉన్న ప్రత్యేక సమాజం.. మొత్తానికి ఇది మహిళలకు మరో ప్రపంచం!

హీలోఫై యాప్‌ ప్రత్యేకంగా పెళ్లయిన మహిళల కోసం రూపొందిన భారతదేశపు అతిపెద్ద మొబైల్‌ యాప్‌. దేశవ్యాప్తంగా 30 లక్షలకు పైగా పెళ్లయిన మహిళలు హీలోఫై ఉపయోగిస్తున్నారు. ఈ ఆండ్రాయిడ్‌ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉచితంగా లభిస్తుంది. హీలోఫై ద్వారా ముఖ్యంగా పెళ్లయిన మహిళలకు ప్రతీదశలోనూ ఉపయోగకరమైన సమాచారం లభిస్తుంది. ఈ యాప్‌ ద్వారా తమ ప్రాంతం వారైన తోటి తెలుగు మహిళలతో తమ సమస్యలను చర్చించుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా తమలో దాగి ఉన్న ట్యాలెంట్‌ను బయటపెట్టి ఇంటినుండే డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉండటం ఈ యాప్‌ ప్రత్యేకత. హీలోఫైలో వంటలు, ఆరోగ్య చిట్కాలు, బరువు తగ్గడానికి ఉపాయాలు, ఇంటిచిట్కాలు, పిల్లల సంరక్షణ, ప్రెగ్నన్సీ, ఫ్యాషన్‌, ఇంకా ఇతర కుటుంబ విషయాలకు సంబంధించిన సమాచారం మన తెలుగులో లభిస్తుంది. హీలోఫై మహిళ పక్షపాతిగా ఉంటూ తాము ఎటువంటి అనుమానాలు, భయాలు లేకుండా తమ సమస్యలను చర్చించుకునే అవకాశం ఉన్న ఒకేఒక్క సురక్షిత వేదిక. ఇక్కడ మీరు సున్నితమైన అంశాలైన నెలసరి సమస్యలు, తల్లిపాలు పట్టించడం, లైంగిక సమస్యలు మొదలైనవాటి గురించి స్వేఛ్చగా ఇతర మహిళలతో తెలుగులోనే చర్చించుకోవచ్చు. హీలోఫై, తెలుగు మహిళలకు ప్రత్యేకమైన, నమ్మకమైన, సురక్షిత వేదిక, ఇందులో ఉండే ఎలాంటి సమాచారాన్నీ మగవారు చూడలేరు. ప్రతి మహిళ తన ప్రత్యేకతను చాటుకునే అవకాశం హీలోఫైలో ఉంది. వంటలు, ఆరోగ్యం, యోగా, ఫిట్‌నెస్‌, ఫ్యాషన్‌, కుట్లు, అల్లికలు, బ్యూటీ టిప్స్‌ వంటి పలు అంశాలపై మీకు తెలిసిన పద్ధతులు, చిట్కాలు వివరిస్తూ వీడియోలు లేదా ఫోటోలు తీసి పోస్ట్‌ చేస్తే చాలు. హీలోఫై యాప్‌లో ప్రతిరోజు వచ్చే ”రోజువారీ చిట్కా” మహిళల దైనందన జీవితానికి సంబంధించిన ఎంతో విలువైన, ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తోంది. అలాగే ఈ యాప్‌లో ప్రతిరోజు డాక్టర్‌ గారితో నేరుగా లైవ్‌లో మాట్లాడి మీ ఆరోగ్య సమస్యలు, బరువు తగ్గడానికి చిట్కాలు, పిల్లల పెంపకం గురించిన అనుమానాలు మొదలైన వాటిని అడిగి తెలుసుకోవచ్చు. అంతేకాదు ఈ యాప్‌లో ఏ మహిళ అయినా, ముఖ్యంగా పెళ్లయిన మహిళలు ఎలాంటి విషయం మీదైనా తమ అభిప్రాయాలు పంచుకోవడం లేదా ప్రశ్నలను అడగవచ్చు. ఇందులో 18000 మందికి పైగా మహిళలు డైట్‌, వంటలు, ఫ్యాషన్‌, లైఫ్‌ స్టైల్‌, పిల్లల పెంపకం, ఇతర కుటుంబ సంబంధాలు వంటి రకరకాల విషయాలపై వారి ప్రశ్నలు అడగడం లేదా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇందులో మంచి విషయం ఏమిటంటే మీరు అడిగే ప్రశ్నలకు 30 నిమిషాలలోపే ఉచితంగా నిపుణుల నుంచి సమాధానం పొందవచ్చు. ఈ యాప్‌లో ఉన్న మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే 10 లక్షలకు పైగా మహిళలు వంటలు, ఆరోగ్యం, ప్రెగ్నన్సీ, ఫ్యామిలీ, పిల్లల పెంపకం వంటి పలు రకాల విషయాలపై గంటలు తరబడి చాటింగ్‌ కూడా చేసుకుంటున్నారు, అది కూడా తెలుగులో! ప్రతీ భారతీయ గ హిణికి ఏదో ఒక ప్రత్యేకమైన కళ లేదా ట్యాలెంట్‌ ఉంటుందని హీలోఫై బలంగా నమ్ముతోంది. ఒకరు కుట్లు, అల్లకల్లో అయితే మరొకరు వంటలు చేయడంలో నైపుణ్యం కలిగి ఉండవచ్చ. దాని ఆధారంగానే కంపెనీ వారు మహిళలకు తమ ట్యాలెంట్‌ చూపించుకోవడం కోసం ఎన్నోరకాల ప్రత్యేకమైన అవకాశాలు కల్పిస్తున్నారు, వీటి ద్వారా ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదిస్తుంటే అంతకన్నా ఇంకేం కావాలి! హీలోఫై వ్యవస్థాపకులు గౌరవ్‌ అగర్వాల్‌ మాటల్లో హీలోఫై యాప్‌ ప్లేస్టోర్‌లో ఉచితంగా లభిస్తోంది, అది ఎప్పటికీ ఉచితంగానే డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించి ఆనందించవచ్చు. భారతదేశంలో ప్రతి ఇంట్లో, అది చిన్న ఊరైనా, పెద్ద నగరంలో ఉన్నవారైనా ఇంటి బాధ్యత అంతా మహిళలే చూసుకుంటారు. అలాంటిది ఇంటర్నెట్‌ ఉపయోగించేవారి సంఖ్య కేవలం 28%గా ఉంది. చాలామంది మహిళలకు తెలుగు మాత్రమే తెలియడం వల్ల ఇంటర్నెట్‌ను ఉపయోగించలేకపోతున్నారు. అందుకోసమే హీలోఫై యాప్‌ తెలుగుతో సహా 7 ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదల అయ్యింది. ఈ యాప్‌ ప్రత్యేకించి పెళ్లయిన ప్రతి భారతీయ స్త్రీ ఉపయోగించదగ్గది. తమ అభిప్రాయాలను, ప్రశ్నలు ఈ వేదికలో నిర్మొహమాటంగా, నిరభ్యంతరంగా పంచుకోవచ్చు. అంతేకాకుండా తమకు తెలిసిన కళలు/ నైపుణ్యాలను ఇతర మహిళలకు నేర్పించడం ద్వారా ఇంట్లోంచి డబ్బు సంపాదించుకోవచ్చు.” హీలోఫై గురించిహీలోఫై కంపెనీ సెప్టెంబర్‌ 2016లో కంపెనీ సి.ఇ.ఓ అయిన ఐఐటి పూర్వ విద్యార్ధి గౌరవ్‌ అగర్వాల్‌, కంపెనీ సి.టి.ఓ అయిన ఎన్‌ఐటి పూర్వ విద్యార్ధి శుభమ్‌ మహేశ్వరి కలిసి స్థాపించారు. ఇప్పటివరకు ఈ యాప్‌ని 30 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రయోజనాలు పొందుతున్నారు. అలాగే ఈ యాప్‌ చాలా అవార్డులు కూడా గెలుచుకుంది. ఈమధ్యనే ఉమన్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌ సెగ్మెంట్‌లో ఆసియా మొత్తానికి భారత అత్యుత్తమ బ్రాండ్‌ అవార్డు 2018-19 సంవత్సరానికి గాను వచ్చింది. ఈ కంపెనీ ప్రధాన ఆఫీసు బెంగళూరులో ఉంది. ఈ కంపెనీ ఇప్పటి వరకు వివిధ చైనా, భారత కంపెనీల ద్వారా 67 కోట్ల భారీ పెట్టుబడులు సాధించగలిగింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close