ఆదాబ్‌ పై మరో తప్పుడు ఎఫ్‌ఐఆర్‌..?

0

ఇదేనా ప్రెండ్లీ పోలీసింగ్‌…

  • హైకోర్టు ఉత్తర్వులు రాస్తే కేసా..?
  • ఖాకీ కక్కుర్తికి నిదర్శనం
  • దమ్ముంటే… అరెస్ట్‌ చేయాల్సింది ఎవరినో తెలుసా…?

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

హైకోర్టు న్యాయమూర్తి లిఖితపూర్వకంగా ఇచ్చిన తీర్పు ప్రతిలోని అక్షరాలను అగ్నికణాలుగా మలచి వార్తా కథనం అందించిన ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’పై మరో తప్పుడు కేసు..? భయపడేది లేదు. ఉరికొయ్యలు, చెరసాలలు, ఇనుప సంకెళ్ళు, కటకటాలు, విూ దౌర్భాగ్య దాష్టికాలు మా పరిశోధనలను ఆపు చేయల్లేవ్‌. మా ముంజేతిని ఖండించినా… అన్యాయంపై పోరాటాలు ఆగవు. ఏం చేస్తారు ఇంతకంటే..? స్వతంత్ర భారతంలో నీచులు నిర్మించుకున్న నికృష్ట సమాజంలో.. జీతాలకోసం.. నీచంగా బతికే దౌర్భాగ్యుల నుంచి ఇంతకంటే ఆశించటం అత్యాశే.

మంచిని ధైర్యంగా, నిజాయితీగా బతికించడం కోసం ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ నిలబడింది. నిలబడుతుంది. ‘న్యాయదేవత’ను కాపాడుకోవడం కోసం మా ప్రాణాలను అడ్డుగా వేస్తాం. అడ్డంగా పోరాడతాం. తప్పు ఎవడు చేసినా తప్పే. అందుకు వేసుకున్న ముసుగులను తొలిగిస్తున్నాం. నేరాలు, ఘోరాలు, అవినీతి, అక్రమాలు చేసే వాడికి కులం, మతం, ఉద్యోగ.రిజర్వేషన్లు ఎందుకు..? తప్పుడు నాయాళ్ళు ఎక్కడ…? ఏ ¬దాలో..? ఉన్నా… చట్టబద్ధంగా తెగబడి తెగనాడతాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. దేశ పౌరులుగా ఇది మా బాధ్యత. మా కర్తవ్యం. మహబూబ్‌ నగర్‌ తప్పుడు కేసు సంఘటన మరవక ముందే …. నిజాలను నిర్భయంగా రాసే ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’పై కుటిల ప్రయత్నంతో కూడిన మరో దాష్టీకం. అయినా బెదిరేది లేదు. బెదరం.

రేపటి సంచికలో… ‘ధర్మపీఠం కళ్ళకు ఖాకీ గంతలు’ స్పష్టంగా కట్టింది. ఈ విషయాన్ని రాస్తే కేసులా… ఖాకీ బాస్‌ జర దేఖో… ఎక్కడో తేడా కొడుతోంది. క్రాస్‌ చెక్‌.. డబుల్‌ చెక్‌… త్రిబుల్‌ చెక్‌… ఫైనల్‌ చెక్‌… ‘ఆదాబ్‌ చెక్‌’ కూడా చేయండి. ధన్యవాదాలు

(రేపు… అసలు కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here