తెలంగాణలో మరో ఎన్నికలు

0

పరిషత్‌ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసిన అధికార టీఆర్‌ఎస్‌ మున్సిపాల్‌ పోరుకు సిద్ధమవుతోంది. పనిలో పనిగా మున్సిపాల్‌ ఎన్నికలపై సిఎం కేసీఆర్‌ ఫోకస్‌ పెట్టారు. లోక్‌ సభ ఎన్నికల ఫలితాలతో ఒకడుగు వెనక్కు వేసిన సీఎం కేసీఆర్‌ తాజా ఫలితాలతో ముందడుగు వేయాలని నిర్ణయించుకునట్టు సమాచారం. వీలైనంత త్వరగా కొత్త మున్సిపల్‌ చట్టం రూపొందించి ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణాలో మున్సిపాలిటీల పదవీకాలం వచ్చే నెల మొదటి వారంలో ముగియనుంది. గడువులోగానే ఎన్నికలు నిర్వహించాలని భావించిన సీఎం కేసీఆర్‌ లోక్‌ సభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో ఆలోచనలో పడ్డారు. ప్రతికూల ఫలితాలు వస్తే కష్టమని భావించిన కేసీఆర్‌ ఓ అడుగు వెనక్కు వేసినట్టు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా వెలువడిన ఫలితాల్లో కారు జోరు జెట్‌ స్పీడ్‌తో సాగడంతో ఇదే ఊపులో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తం 32 జడ్పీ పీఠాలను కైవసం చేసుకోవడంతో టిఆర్‌ఎస్‌ కేడర్‌లోనూ ధీమా పెరిగింది. రాష్ట్రం విషయానికి వచ్చేసరికి ప్రజలు తమతోనే ఉన్నారనే అభిప్రాయానికి అటు నేతలతో పాటు ఇటు కార్యకర్తలు వచ్చారు. ప్రజల మూడ్‌ తమకు అనుకూలంగా ఉన్న ఈ సమయంలోనే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తే గులాబీ జెండాకు ఎదురుండదని కారు పార్టీ అగ్రనతేలు భావిస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here