పీఎన్‌బీ కుంభకోణంలో.. మరొకరి అరెస్టు

  0

  కోల్‌కతా : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మోహుల్‌ ఛోక్సీకి సంబంధించిన ఓ వ్యక్తిని మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్టు చేశారు. హాంకాంగ్‌లోని ఛోక్సీకి చెందిన డొల్లకంపెనీలో డైరెక్టర్‌గా వ్యవ హరిస్తున్న దీపక్‌ కృష్ణారావ్‌ కులకర్ణిని కోల్‌కతా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారి వెల్లడించారు. సోమవారం రాత్రి కులకర్ణిపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి. అయినప్పటికీ.. ఆయన దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు అరెస్టు చేశారు. అతడిని ప్రస్తుతం విచారణ నిమిత్తం రిమాండ్‌కు పంపించారు. హాంకాంగ్‌లోని ఛోక్సీ డవ్మిూ కంపెనీల్లో ఒకదానికి కులకర్ణి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఛోక్సీపై నమోదైన ఛార్జిషీట్‌లో కులకర్ణి పేరు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పీఎన్‌బీకి రూ.13వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నీరవ్‌ మోదీ, ఛోక్సీలను పట్టుకునేందుకు భారత అధికారులు ప్రయత్నిస్తున్నారు. విదేశాల్లో తలదాచుకుంటున్న వారిని భారత్‌ రప్పించేందుకు ఈడీ, సీబీఐ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరికి చెందిన పలు ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నీరవ్‌ మోదీపై ఇంటర్‌పోల్‌ అధికారులు రెడ్‌ కార్నర్‌ నోటీసులు సైతం జారీ చేశారు.

  స్క్రీనింగ్‌ కమిటీ భేటీ లోంచి

  రేవంత్‌ బయటకు…

  న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశమయ్యింది. ఈ సమావేశంలో నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికను ఫైనల్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని కాంగ్రెస్‌ నాయకులు, ఆశావహులు ఉత్కంటతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సమావేశంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఈ సమావేశం నుండి అర్ధాంతరంగా బైటకు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. తన సెక్యూరిటీ విషయంలో హోం మంత్రితో అపాయింట్‌ మెంట్‌ ఉందంటూ చెప్పి ఆయన బైటికి వెళ్లిపోయారని సమాచారం. రేవంత్‌ ఈ సమావేశం మధ్యలోనుంచి వెళ్లిపోవడంపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే క్రమంలో తెలుగు దేశం పార్టీ నుండి చాలామంది నాయకులను కాంగ్రెస్‌ లోకి తీసుకువచ్చారు. ఆ సమయంలో వారికి రేవంత్‌ రెడ్డితో పాటు కాంగ్రెస్‌ నాయకులు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం రేవంత్‌ కోరిన వారికి సీట్లివ్వడానికి స్క్రీనింగ్‌ కమిటీ సుముఖత వ్యక్తం చేయలేదని..అందువల్లే ఆయన సమావేశం మధ్యలోంచి వెళ్లిపోయాడని ప్రచారం జరుగతోంది. ఇక ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల అభ్యర్థులను దాదాపు ఖరారుచేసినట్లు తెలుస్తోంది. మిగతా జనరల్‌ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ఇక కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశం ఈ సమావేశంలో ఓ కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here