అనిరుధ్‌ దశ తిరిగినట్టేనా

0

కోలీవుడ్‌ సంగీత సంచలనం అనిరుధ్‌ రవిచందర్‌ మొదటి సినిమా అజ్ఞాతవాసి పవన్‌ కళ్యాణ్‌ తో చేసినప్పుడు అతని మీద అంచనాలు ఆకాశమే హద్దుగా ఉండేవి. దానికి తగ్గట్టే మొదట్లో రిలీజైన ఫస్ట్‌ సాంగ్‌ సూపర్‌ హిట్‌ కావడంతో మనకు మరో రెహమాన్‌ దొరికాడు అనుకున్నారందరూ. కానీ రిలీజయ్యాక అవన్నీ ఆవిరైపోయాయి. బాలన్స్‌ పాటలతో పాటు రీ రికార్డింగ్‌ విషయంలో అనిరుధ్‌ నిరాశ పరిచాడు. అఫ్‌ కోర్స్‌ కంటెంట్‌ వీక్‌ గా ఉన్నప్పటికీ సంగీతం పరంగా అనిరుధ్‌ ఆశించిన అవుట్‌ ఫుట్‌ ఇవ్వలేదన్న మాట వాస్తవం.

ఇప్పుడు రెండో సినిమా జెర్సీ వచ్చేసింది. పాజిటివ్‌ టాక్‌ తో నానికి ఏడాది పైగా గ్యాప్‌ తర్వాత సూపర్‌ హిట్‌ ని ఖాతాలో వేసింది. ఎమోషనల్‌ కంటెంట్‌ జనాన్ని థియేటర్‌ కు లాక్కుని వస్తోంది. మరి అనిరుధ్‌ దశ తిరిగినట్టేనా అని మ్యూజిక్‌ లవర్స్‌ ప్రశ్నించుకుంటున్నారు. నిజానికి జెర్సీ బీజీఎమ్‌ విషయంలో అనిరుధ్‌ నిరాశ పరచలేదు. లైఫ్‌ ఇచ్చాడు. సీన్స్‌ కు తగ్గ మ్యూజిక్‌ తో ఆకట్టుకున్నాడు. అయితే పాటలు మాత్రం టాప్‌ చార్ట్‌ బస్టర్స్‌ గా నిలవలేకపోయాయి. కథ మూడ్‌ కు అనుగుణంగా ట్యూన్స్‌ అయితే ఉన్నాయి కానీ పదే పదే స్మార్ట్‌ ఫోన్స్‌ లోనో కార్‌ మ్యూజిక్‌ సిస్టమ్‌ లోనో వినేలా లేవని ఇంతకు ముందే ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. రఘువరన్‌ బిటెక్‌ రేంజ్‌ లో ఓ మ్యూజికల్‌ ఆల్బమ్‌ ఇస్తే అనిరుధ్‌ మీద ఇక్కడ ఆశలు పెట్టుకోవచ్చు. లేదూ పూర్తిగా కథ ఆర్టిస్టులు దర్శకుడి పనితనం మీద ఫలితాలు డిపెండ్‌ అయ్యే జెర్సి లాంటి సినిమాలకు యావరేజ్‌ మ్యూజిక్‌ ఇస్తూ పోతే ఇక్కడ తనదైన మార్కు వేసుకోవడం కష్టమే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here