Featuredప్రాంతీయ వార్తలు

ఆంధ్ర దిశ నిర్ధేశం

  • ఏపీ అసెంబ్లీలో ‘దిశ-2019’ బిల్లు ఆమోదం
  • బిల్లుపై అసెంబ్లీలో సుధీర్ఘంగా సాగిన చర్చ
  • ఏకగ్రీవంగా బిల్లుకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ
  • బాధితులకు సత్వర న్యాయం అందించడానికే ‘దిశ’ చట్టం
  • చట్టాల్లో మార్పులు వస్తేనే ప్రభుత్వాలపై నమ్మకం పెరుగుతుంది
  • రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుబడితే మరణశిక్షలు
  • ఏడు రోజుల్లో దర్యాప్తు.. 21రోజుల్లోనే విచారణ పూర్తి
  • చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడితే జీవితఖైదు

అమరావతి

మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ‘దిశ -2019’ బిల్లు ఏపీ అసెంబ్లీలో ఆమోద పొందింది. ¬ంశాఖ మంత్రి సుచరిత బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బిల్లుపై అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే సభ్యులు దిశ బిల్లుపై తమ అభిప్రాయాలు తెలిపారు. అనంతరం స్పీకర్‌ బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించారు. అధికార, ప్రతిపక్ష నేతలందరూ కూడా దిశ బిల్లుకు మద్దతు తెలిపారు. దీంతో ఏపీ అసెంబ్లీ దిశ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఈ కొత్త చట్టంతో మహిళలపై నేరాలకు పాల్పడే వారికి 14రోజుల్లో విచారణ పూర్తి చేసి, 21 రోజుల్లో శిక్షలు విధించేలా చర్యలు తీసుకోనున్నారు. దిశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టనున్నారు. ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయబోతుందని, శిక్షల అమలులో కూడా జాప్యం ఉండదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై అసభ్యంగా ఫోస్టింగ్స్‌ చేసేవాళ్లకి.. ఇకపై సామాజిక మాధ్యమాల్లో మహిళలపై అసభ్యంగా ఫోస్టింగ్స్‌ చేసేవాళ్లకి.. రెండు సంవత్సరాల కారాగార శిక్షతో పాటు, లక్ష రూపాయల జరిమానా విధించనున్నారు. ఇక ఈ బిల్లుపై జగన్‌ మాట్లాడుతూ.. గత రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉండేవని.. విప్లవాత్మక చర్యలు తీసుకుంటేనే మార్పు సాధ్యమవుతుందన్నారు. నేరం చేసింది ఎంతవారైనా కూడా వదిలే సమస్య లేదని, దిశ లాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితులున్నాయని, దారుణ ఘటనలు నివారించాలంటే విప్లవాత్మక చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో దిశ ఘటన దేశం మొత్తాన్ని కలిచివేసిందని ఆయన చెప్పారు. హత్యాచార నిందితులను తక్షణమే శిక్ష వేయాలని అందరు కోరుకుంటున్నారని, దిశ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిందని తెలిపారు. సినిమాల్లో అత్యాచారం చేసినవారిని తుపాకీతో కాల్చి చంపితే చప్పట్లు కొడతామని, తెలంగాణలో అదే పనిచేసిన పోలీసులను, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్‌కౌంటర్‌ తర్వాత ఎన్‌హెచ్‌ఆర్సీ, సుప్రీంకోర్టు విచారణలు.. హత్యాచారం తప్పు అయినా పోలీసులు చేసింది తప్పు అని చెబుతారా అని వ్యాఖ్యానించారు. అదే జరిగితే శిక్షించడానికి పోలీసులు, ప్రభుత్వాలు ముందుకు రావన్నారు. అప్పుడు దేశంలో హత్యాచారాలు పెరిగి అరాచకాలు పెచ్చరిల్లుతాయని జగన్‌ చెప్పుకొచ్చారు. మనిషి రాక్షసత్వానికి పాల్పడితే త్వరగా న్యాయం కావాలని కోరుకుంటామని, నిర్భయ చట్టం వచ్చి ఏడేళ్లయినా హత్యాచార నిందితులకు ఉరిశిక్ష పడలేదన్నారు. చట్టాల్లో మార్పువస్తేనే ప్రభుత్వాలను ప్రజలను నమ్ముతారన్నారు. బాధితులకు సత్వరమే న్యాయం అందించడానికి దిశ బిల్లు తీసుకొచ్చామని జగన్‌ తెలిపారు. అంతకు ముందు ఏపీ ¬ంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. మహిళలకు భద్రత కల్పించే ఈ చారిత్రక బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం తనకు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. జగన్‌ మహిళా పక్షపాతి అన్నారు. హైదరాబాద్‌ దిశ ఘటనను చూసి మానవత్వం ఉన్న ప్రతి మనిషీ చలించిపోయారన్నారు. ఈ ఘటన తర్వాత తమ బిడ్డలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు. పట్టపగలు కూడా మహిళలు బయట తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఏపీలో మహిళలందరికీ జగనన్న ఒక రక్ష.. ఎవరైనా మహిళలపై చేయి వేస్తే పడుతుంది కఠిన శిక్ష అనే విధంగా రాష్ట్రంలో చట్టాన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు.

‘దిశ’ బిల్లును స్వాగతిస్తున్నాం – చంద్రబాబు

మహిళల భద్రత గురించి ప్రత్యేక చట్టం తీసుకురావడాన్ని తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని ఏపీ ప్రతిపక్ష నేత, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘దిశ’ బిల్లుపై ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటికే కొన్ని చట్టాలు ఉన్నాయనీ.. వాటన్నింటినీ అధ్యయనం చేసి అవసరమైతే కేంద్రాన్ని కూడా సంప్రదించాలని సూచించారు. చట్టాలు చేయడం ఎంత ముఖ్యమో, ఉన్న సమస్యల్ని అధిగమించుకుంటూ వాటిని అమలు చేయడం అంతకన్నా ముఖ్యమైందన్నారు. ఈ చట్టం అమలులో నిర్లక్ష్యం వద్దని తెలిపారు. దోషులు ఎంత గొప్పవారైనా చర్యలు తీసుకొనే పరిస్థితి ఉండాలన్నారు. బిల్లు శుక్రవారమే తమకు ఇచ్చారని.. ఇంకా పూర్తిగా అధ్యయనం చేయలేదనీ, ఈ బిల్లులో చేసిన సవరణలు కూడా తాము ఆమోదిస్తున్నట్టు తెలిపారు. ఎంత చొరవతో ఈ బిల్లు తీసుకొచ్చారో దీన్ని అమలు చేయడంలో అదే ఉత్సాహం చూపించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ చట్టంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. చట్టాన్ని అమలు చేసే ప్రభుత్వం కూడా ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులపై ఎలక్షన్‌ వాచ్‌డాగ్‌ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) అఫిడవిట్‌ల ఆధారంగా విశ్లేషించిందని ఈ సందర్భంగా చంద్రబాబు సభలో ప్రస్తావించారు. ఆ సంస్థ నివేదిక ప్రకారం 21 మంది భాజపా, 16 మంది కాంగ్రెస్‌, ఏడుగురు వైకాపా నేతలు.. ఇంకా కొన్ని పార్టీలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. దీనిపై వైకాపా సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేయగా.. చంద్రబాబు సమాధానం చెబుతూ.. సీఎం జగన్‌పై తాను ఆరోపణలు చేయడంలేదనీ.. వాస్తవాలు చెబుతున్నప్పుడు సరిచేసుకోవాలని చెబుతున్నానన్నారు. చట్టం మనకు చుట్టమైనప్పుడే సమస్యలు వస్తాయనీ.. చట్టాన్ని చట్టంగా అమలుచేస్తే అసలు సమస్యలు ఉండవన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close