జాతీయ వార్తలు

అమిత్‌ షా అద్భుత ఇన్నింగ్స్‌

ఆసేతు హిమాచలం వరకు పార్టీ ప్రతిష్ట

బిజెపిని ప్రజల పార్టీగా తీర్చిదిద్దిన ఘనుడు

కఠోర పరిశ్రమ, అకుంఠిత దీక్షతోనే సాధ్యం

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మతతత్వం పార్టీ ముద్రవేసిన బిజెపిని అందరి పార్టీగా ఆమోదింప చేయడంలో పార్టీ అధ్య క్షుడుగా అమిత్‌ షా చేసిన కృషి అమోఘం. ఆయన పార్టీని విజయతీరాలకు చేర్చడే గాకుండా అన్ని వర్గా ప్రజలను అం దులోకి రప్పించారు. బిజెపితో అంతా కలసి పోయేలా చేసిన సమర్థ నాయకుడిగా అమిత్‌ షా గొప్పతనాన్ని గుర్తించాల్సిందే. జనసంఘ్‌ కాలం నుంచీ పార్టీ అంచెలంచెలుగా బలోపేతం కావడం, లాల్‌ కృష్ణ ఆడ్వాణీ హయాంలో బిజెపి దాదాపు అన్ని రాష్ట్రాల్లో బలమైన నిర్మాణాల ను ఏర్పర్చుకోవడం జరిగింది. అంతటి పటిష్ట నాయకుడి తరవాత మళ్లీ అమిత్‌ షా హయాంలో పార్టీ ఒక తిరుగులేని శక్తిగా మారింది. అద్వానీ తరవాత అంతటి సమర్థ నాయకుడిగా అమిత్‌ షా తన అధ్యక్ష పాత్రను అద్భుతంగా నిర్వహించారు. తన కెప్టెన్సీలో అద్భుతాలు సాధించారు. అనేక రాష్టాల్ల్రో పార్టీని బలోపేతం చేసి, అధికారం కట్టబెట్టారు. అద్వానీ తరవాత పార్టీ బాధ్యతలతో పాటు, ¬ంమంత్రిత్వ శాఖను కూడా సమర్థంగా నిర్వహిస్తున్నారు. బలమైన సభ్యత్వం ఉన్న పార్టీకి బలమైన నిర్మాణం ఏర్పడుతుందని, అది తర్వాతి కాలంలో ఎన్నికల్లో విజయానికి దారి తీస్తుందని అమిత్‌ షా విశ్వసించారు. ఆయన వ్యూహరచన ఫలితంగానే గత సార్వత్రక ఎన్నికల్లో బిజెపి పశ్చిమ బెంగాల్‌లో 40 శాతం ఓట్లతో 18 సీట్లను సాధించ గలిగింది. మూడు దశాబ్దాలుగా ఆ రాష్టాన్న్రి ఏలిన మార్క్సిస్టు పార్టీ కేవలం ఆరు శాతం ఓట్లకే కుదించుకుపోగా, వందేళ్లకు పైగా చరిత్ర ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీకి 5 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కొన్నేళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌లో ఏ నిర్మాణమూ లేని బిజెపి ఇవాళ ప్రతి నియోజకవర్గం లోనూ బలంగా వేళ్లూనుకుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో బిజెపికి రికార్డు స్థాయిలో 77 లక్షలమంది సభ్యులున్నారంటే అది అమిత్‌ షా అమలు చేసిన వ్యూహరచన వల్లే సాధ్యపడింది. వామపక్షాలను తుడిచిపెట్టి బిజెపి అధికారంలోకి వచ్చిన త్రిపురలో కూడా పార్టీ 10 లక్షలమంది సభ్యులను సంపాదించు కోగలిగింది. ఇదే వ్యూహం అమిత్‌ షా దేశమంతటా అనుసరించారు. దక్షిణాది రాష్టాల్ల్రో కూడా దాదాపు కోటి మంది కొత్త సభ్యులను చేర్చుకున్నారు. అమిత్‌ షా హయాంలో భారతీయ జనతా పార్టీ దేశమంతటా ఒక బలమైన పునాదిని నిర్మించుకుని కేవలం హిందీప్రాంత పార్టీగా తనపై పడ్డ ముద్రను పూర్తిగా తొలగించు కోగలిగింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, కచ్‌ నుంచి కోహిమా వరకు ఇవాళ బిజెపి ఉనికి లేని రాష్ట్రం లేదని సగర్వంగా చెప్పుకోగలుగుతోంది. 2015 మార్చిలో అమిత్‌ షా హయాంలో ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా మారే సమయానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కనీసం ఒక ఏడాది కూడా పూర్తి చేసుకో లేదు. అమిత్‌ షా 2014 జూలైలో పార్టీ బాధ్యతలు స్వీకరించే నాటికి బిజెపి సభ్యుల సంఖ్య కేవలం 3,60,000 మాత్రమే. కాని అనతికాలంలోనే అమిత్‌ షా బిజెపిని ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా మార్చగలిగారు. అంటే ఇది ఆయన మేధోశక్తికి, కఠోర పరిశ్రమకు నిదర్శనంగా చూడాలి. వివిధ రాష్టాల్లో ఆ పార్టీని అధికారంలోకి తేగలిగారంటే సామాన్యమైన విషయం కాదు. అమిత్‌ షా పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే సభ్యత్వ నమోదుకు సంబంధించి పాత నిబంధనలను సడలించి కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆధునిక టెక్నాలజీనివిస్తృతంగా వినియోగించారు. ఆన్‌ లైన్‌, మొబైల్‌ ద్వారా సభ్యులను చేర్చుకునే పక్రియను ప్రారంభించారు. ప్రాథమిక, క్రియాశీలక సభ్యుల విషయంలో కూడా ఆయన కీలక మార్పులు చేపట్టారు. వందమంది సభ్యులను చేర్పించి, పార్టీ కార్యక్రమాల్లో సాధ్యమైనంత ఎక్కువ కాలం చురుకుగా పాల్గొన్న వారిని క్రియాశీలక సభ్యులుగా గుర్తించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రక్షాళన చేసి డిజిటల్‌ పక్రియను ప్రవేశపెట్టారు. సోషల్‌ విూడియాను విస్తృతంగా వినియోగించుకున్నారు. ఆయన అనుసరించిన పద్ధతుల వల్ల పార్టీకి బలమైన పునాది ఏర్పడడమే కాక విస్తరణకు అద్భుతంగా దోహదం జరిగింది. ‘సదస్యతా మహా అభియాన్‌’ పేరిట అమిత్‌ షా ప్రారంభించిన ఒక బృహత్తర యజ్ఞం వల్లనే బిజెపి ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా మారిందనడంలో సందేహం లేదు. ఈ అభియాన్‌ను మరో ‘దండి యాత్ర’గా అభివర్ణించిన అమిత్‌ షా సభ్యత్వ నమోదును సీరియస్‌గా తీసుకుని ముందుకు సాగారు. స్వయంగా ప్రచార కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు దేశమంతటా వేల కిలో విూటర్ల దూరం పర్యటించారు. సభ్యత్వ లక్ష్యాలను అమిత్‌ షా పార్టీ నేతలకు అలవోకగా నిర్దేశించలేదు. ప్రతి రాష్ట్రంలోనూ బిజెపి సభ్యుల సంఖ్య, పోలైన ఓట్లు, సానుభూతిపరులు, ప్రజల్లో కనిపించిన ప్రతిస్పందన ఆధారంగా ఆయన సభ్యత్వ లక్ష్యాలను నిర్దేశించారు. దీనదయాళ్‌ ఉపాధ్యాయ స్ఫూర్తిదాయక మాటలను ఆయన ఆచరణలో రుజువు చేసి చూపించారు. 370 ఆర్టికల్‌ రద్దు, ట్రిపుల్‌ తలాక్‌, అయోధ్య, పౌరసత్వ సవరణ చట్టం వంటి కీలక అంశాల్లో అమిత్‌ షా ముద్రను స్పష్టంగా చూడవచ్చు. అంతేగాకుండా బలమైన అభిప్రాయంతో వీటిని ముందుకు తసీఉకుని వెళ్లగలిగారు. ఇవాళ దేశంలో మెజారిటీ భారతీయుల్లో దేశాభిమానం పెరిగేందుకు పరోక్షంగా దోహదం కల్పించారు. బిజెపి అధ్యక్షుడుగా అమిత్‌ షా కఠోర నిర్ణయాలతో పార్టీని విజయతీరాలకు చేర్చారు. కొత్త చరిత్ర సృష్టించారు. ఆయన ఆడిన ఇన్నింగ్స్‌ చాలా గొప్పవి. ఆయన నిర్దేశకత్వంలో పార్టీ ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close