Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

అమీన్‌పూర్‌ కబ్జాలపై చేతులెత్తేసిన ప్రభుత్వం

పటాన్‌ చెరు, అమీన్‌ పూర్‌ మండలాల్లో పోస్టింగ్‌ అంటే అధికారులు కోటీశ్వరులుగా మారడం ఖాయం

  • పిడికిలి బిగించాల్సిన అధికార యంత్రాంగం చేతులు చాచి క్యూలో నిలబడుతున్న వైనం
  • ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేస్తున్న సబ్‌రిజిస్ట్రార్‌

˜- అనుమతుల అవసరమే లేదు, ఇంటి నెంబర్‌ కేటాయిస్తాను అంటున్న మున్సిపల్‌ కమిషనర్‌

˜– కబ్జాలు అవుతున్నా కళ్ళు మూసుకున్న ఎమ్మార్వో

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): రెవెన్యూ మున్సిపల్‌ అధికా రుల సాక్షిగా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలో కబ్జాదారులు విశ్వరూ పం ప్రదర్శిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు ఆర్డీవో ఎమ్మార్వో స్థాయి అధికారులు కబ్జాదారుల కను సైగల్లో పనిచే స్తున్నారు. అనడానికి నిదర్శనంగా ప్రభుత్వ స్థలాల్లో ఇష్టారా జ్యంగా ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. అయినా వారిని అడ్డుకోక పోగా అక్రమార్కులు కట్టిన ఇండ్లకు అత్యధిక ధర పలికే విధంగా అధికారులు యుద్ధ ప్రాతిపదికన కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ విధంగా వెలుస్తున్న పలు కాలనీ కహానీల కథనాల పరం పరలో భాగంగా నేడు కె.ఎస్‌.ఆర్‌ కాలనీలో జరుగుతున్న కోట్లాది రూపాయల అక్రమాలు లావాదేవీలతో పాటు ప్రభుత్వ స్థలాలను అధికార యంత్రాంగం, కబ్జాదారులకు అప్పగిస్తున్న వైనంపై ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక కథనాన్ని ప్రజలు, ప్రభుత్వం ముం దు ఉంచుతుంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ గ్రామంలోని సర్వే నెంబర్‌ 993/44, 993/45, 993/45/ఏ లలో మాజీ సైనికుల పేరున సుమారు 14 ఎకరాల మూడు గుంటలను స్థలాన్ని ప్రభు త్వం కేటాయించారు. నిబంధనల ప్రకారం మాజీ సైనికో ద్యోగులు 10 సంవత్సరాల తరువాత వారి స్థలాన్ని ప్రైవేటు వ్యక్తు లకు అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు సదరు స్థలాన్ని కొత్త కాపు సంజీవ రెడ్డి కొనుక్కుని కె ఎస్‌ ఆర్‌ కాలనీ పేరుతో రెండువేల సంవత్సరంలో అమీన్‌ పూర్‌ గ్రామ పంచా యతీ నుండి సుమారు 339 ప్లాట్లను చూపిస్తూ లే అవుట్‌ను మంజూరు చేయించుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా లేఅ వుట్‌లో చూపించిన పార్కుస్థలం కమ్యూనిటీ స్థలాలలో కొన్నిం టిని అమ్మేసిన ఆయన తన స్థలాన్ని ఆనుకుని ఉన్న దేవాలయ స్థలంలోనూ, ప్రభుత్వ స్థలంలోనూ సర్వే నంబర్‌ 993/44, 993/45నే చూపిస్తూ వందలాది ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ విధంగా ప్రభుత్వ దేవాదాయ శాఖ స్థలాలకు ఎసరు పెట్టిన కొత్త కాపు సంజీవరెడ్డి, వందల కోట్లను సంపా దిస్తూ జిల్లాస్థాయితో పాటు ఆర్డిఓ, ఎమ్మార్వో, మున్సిపల్‌ యం త్రాంగాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకుని ప్రజాధనాన్ని పెద్దఎ త్తున కొల్లగొడుతున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం అక్రమ నిర్మా ణాలను ఆపాల్సిన మున్సిపల్‌ అధికారులు కెఎస్‌ఆర్‌ విదిల్చే అవి నీతి సొమ్ముకు ఆశపడి మౌనవ్రతం పాటిస్తూ పరోక్షంగా న్యాయ సలహాలు ఇస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారని స్థానికులు విమర్శించారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కబ్జాల పైన, అక్రమ నిర్మాణాల పైన ఎలాంటి నోటీసులు లేకుండానే చర్యలకు ఉపక్ర మించాలని ఆదేశించినా, ఇక్కడ సాక్షాత్తు కే.సి.ఆర్‌ మాట సైతం చెల్లుబాటు కావడం లేదు అన్నది సత్యంగా మారింది. మరో పక్క బరితెగించిన అమీన్‌పూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ప్రభుత్వ స్థలాల్లో నిర్మించే ఇండ్లకు హెచ్‌ ఎమ్‌ డి ఏ లేదా మున్సిపల్‌ అనుమతుల అవసరం లేదని చెబుతూ వాటన్నింటిని రెగ్యులరైజ్‌ చేస్తూ ఇంటి నెంబర్లను కేటాయించడంలో చేతులు మారుతున్న కోట్లాది రూపాయల అవినీతికి పరాకాష్టగా మారింది.

 ప్రభుత్వ స్థలాల పరిరక్షణ సంగారెడ్డి జిల్లా కలెక్ట రుకు సైతం కానటువంటి పరిస్థితుల్లో, ముఖ్యమంత్రిగా ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన పెద్దదిక్కుగా ఓ నిమిషం అయినా తన సమయాన్ని కేటాయించి ప్రజల ఆస్తులను కాపాడేందుకు కషి చేయాలని గ్రామస్తులు  కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. కబ్జాదారులపై పిడికిలి బిగించాల్సిన ముఖ్యమంత్రి, రెవెన్యూ యంత్రాంగం పై పట్టు కోల్పోవడం దుర దష్టకరమని తెలంగాణ ప్రజలకు ఇది శాపంగా మారిందని వా రు ఆవేదన వ్యక్తపరిచారు. ఇక ప్రభుత్వ స్థలాలను చట్టబద్ధం చే స్తూ అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్న సబ్‌ రిజిస్ట్రార్‌ వ్యవహారం సైతం అవినీతిమయంగా మారిందని, తక్ష ణమే ఆయనను బదిలీ చేసి ప్రభుత్వ స్థలాల రక్షణకు పటిష్టమైన చర్యలు సూచిస్తూ ఆదే శాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు వివరించారు. 
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close