అంబర్‌పేటలో అశాంతిని సృష్టిస్తున్నారు

0

  • లేని మసీదు ఉందని ఎంఐఎం నేతలు
  • టీఆర్‌ఎస్‌తో దోస్తానీ చేస్తే ఏదైనా చేయ్యొచ్చా..?
  • ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే ఆ స్థలానికి డబ్బులిచ్చేశాం
  • బీజేపీ నేత కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ : ప్రశాంతంగా ఉన్న అంబర్‌పేటలో ఎంఐఎం పార్టీ అశాంతిని సృష్టించిందని బీజేపీ నేత కిషన్‌ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. నగరంలోని ప్రశాంతతను, మతసామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు అకారణంగా యువకుల మీద అక్రమ కేసులు నమోదు చేశారని అన్నారు. అక్కడ లేని మసీదు ఉందని ఎంఐఎం నేతలు అలజడులు రేపుతున్నారన్నారు. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడే ఆ వివాదాస్పద స్థలాన్ని ప్రభుత్వం స్థల యజమానులకు డబ్బు చెల్లించి స్వాధీనం చేసుకున్నారని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే ఈ సమస్య వచ్చిందని.. అక్కడ లేని మసీద్‌ను ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌తో దోస్తానీ చేస్తే ఏమైనా చెయ్యొచ్చా అని నిలదీశారు. దీనికి అధికార పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎవరికీ ఇబ్బంది జరగకుండా స్థలం కోల్పోయిన వాళ్ళకందరికి మార్కెట్‌ రేటు కంటే ఎక్కువ పారితోషకం ఇచ్చామన్నారు. మొత్తం 280 మందికి గాను ఇప్పటివరకు 170 మందికి నష్టపరిహారం చెల్లించామని వివాదాస్పద స్థల యజమానులుకు కూడా నష్టపరిహారం చెల్లించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 2 కోట్ల 50 లక్షల రూపాయలు ఏడాది క్రితం ఆ స్థల యజమానులకు ప్రభుత్వం ఇచ్చిందని స్పష్టం చేశారు. గతేడాది ఏప్రిల్‌లోనే అక్కడ నిర్మాణాన్ని తొలగించామన్నారు. అది ప్రైవేట్‌ ప్రాపర్టీ అని, పోలీసులను పక్కన పెట్టుకుని ఎమ్‌ఐఎమ్‌ ఎమ్మెల్యే పాషా ఖాద్రి అక్కడ నమాజ్‌ చేశారని పేర్కొన్నారు. అన్నీ తెలిసిన పోలీస్‌ కవిూషనర్‌ మజ్లీస్‌కు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో చెప్పాలన్నారు. ఆ ల్యాండ్‌ ఓనర్లు కూడా అక్కడ మసీద్‌ లేదని ఫిర్యాదు చేశారని అన్నారు. కానీ ఇప్పుడు కొందరు ఆ స్థలంలోకి వచ్చి ఇక్కడ మసీదు ఉందని, ఇది మసీదు స్థలమని లేని దగ్గర మసీదును సృష్టిస్తున్నారని, మతపరమైన ఘర్షణలకు కుట్రలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఒక్క ఎమ్‌ఐఎమ్‌ పార్టీ తప్పా మిగిలిన అన్ని పార్టీలు ఒక్క తాటిపై ఉన్నాయని తెలిపారు. ¬ం మినిష్టర్‌ మాట మార్చి.. మసీద్‌ నిర్మాణం చేస్తామని చెబుతున్నారు.. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మసీద్‌ నిర్మాణానికి ఒప్పుకునేది లేదని.. దీనిపై ఫిర్యాదు చేసేందుకు సీఎస్‌ను కలుస్తామన్నారు. అంబర్‌ పేటలో ఉద్రిక్తతకు మజ్లీస్‌, పోలీసు, జీహెచ్‌ఎంసీనే కారణమని కిషన్‌ రెడ్డి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here