Featured

దేశ 2వ రాజధానిగా అమరావతి..?

కేంద్రం కసరత్తులు

ముఖ్యులతో చర్చలు

ఇంటిలిజెన్స్‌తో ఆరా..!

దక్షిణాదిలో పాగా

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్‌ నాయకులు ఒక విధమైన ఆలోచనలతో ముందుకు సాగుతుండగా.. కేంద్రం దక్షిణాదిన ‘పాగా’ వేయటానికి సంసిద్దమైయినట్లు తెలుస్తోంది. ఊహించని విధంగా అమరావతిని దేశ రెండవ రాజధానిగా చేస్తే ‘ఎలా ఉంటుంది..?’ అనే కోణంలో నిశ్శబ్దంగా కసరత్తులు చేస్తోంది. ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన అమరావతిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంతో ప్రజలకు అత్యంత చేరువకావాలనే లక్ష్యం కూడా కమలనాథులకు ఎలాంటి ఖర్చు లేకుండా తీరుతుంది. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న సంచలన పరిశోధన కథనం.

ఎత్తు’గడలు’ వేరు.. భాజపా రాజకీయ ఎత్తుగడలు వేరు. గతంలో కేవలం రెండు పార్లమెంట్‌ సీట్లున్న పార్టీ ‘అద్వానీ రథయాత్ర’తో బలం పుంజుకొని… నాలుగు సార్లు అధికారం చేపట్టింది. అందులో రెండుసార్లు వాజ్‌ పేయ్‌ ‘ఉగిసలాడే’ ప్రధానిగా ఉండగా.. మోడీ మాత్రం సుస్థిరంగా ముందుకు సాగుతోంది.

ఎలా లాభం: దక్షణాదిన అమరావతి తెలంగాణ, చత్తీస్‌ గడ్‌, కర్నాటక, తమిళనాడు, ఒడిషా, కేరళ, పాండిచ్చేరిలకు.. అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఇప్పటికే వేలాది ఎకరాలు అందంగి అందుబాటులో ఉంది. దీనికి తోడు భవనాలు ఉన్నాయి. ఆంటే పైసా అదనపు.ఖర్చు లేకుండా దేశానికి రెండవ రాజధాని ఏర్పాటు. ఇంత మంచి ఛాయస్‌ గురించి భాజపా ట్రబుల్‌ షూటర్‌ అమిత్‌ షా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్‌ విభాగం ఇప్పటికే తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. దీనిపై కేంద్ర హోంశాఖ వర్గాలు పెదవి విప్పడంలేదు. కాని అంతర్గతంగా పార్టీ ముఖ్యులు తీవ్ర స్థాయిలో ఢిల్లీలో తెలంగాణ ప్రముఖుడి

(పేరు బయటపెట్టమని ‘ఆదాబ్‌’ మాట ఇచ్చింది. మా ప్రతినిధులను కూడా ఎవరూ ఇబ్బంది పెట్టరాదు.) విలాసవంతమైన భవనంలో ఈ చర్చలు జరిపారు.

ఎవరికి దెబ్బ..

భాజపా దేశ రెండో రాజధాని ‘అమరావతి’ ప్లాన్‌ వల్ల అటు వైకాపా, ఇటు తెలుగుదేశం పార్టీలను గుట్టుచప్పుడు కాకుండా చుట్టేయవచ్చు. అంతే కాకుండా… తమిళనాట రజనీతో అనుబంధం పెనవేసుకోవడానికి పనికొస్తుంది. అలాగే ‘కర్నాటకాలకు’ సైతం అమరావతి నుంచే ఆపరేషన్స్‌ చేయవచ్చు. ఇదిలా ఉండగా తెలంగాణలో మజ్లీస్‌ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్న కేసీఆర్‌ కు కూడా భాజపా ఎత్తులు చెప్పే అవకాశం ఉంది.

‘పుంజు’ కొంటుందని ప్లాన్‌..

కమలదళాలు ఇంతగా ‘ఎక్సరే’సైజులు చేసినా దక్షిణాదిలో ‘పుంజు’కుంటుందా..? అనేది ఓ బేతాళప్రశ్న. ఇప్పుడున్న బలం పార్లమెంటు ఎన్నికల్లో ఒకవిధంగా, అసెంబ్లీలో మరో విధంగా, స్థానిక సంస్థల్లో ఇంకో విధంగా ప్రజలు విలక్షణమైన తీర్పులు ఇస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు స్థానాలు, అసెంబ్లీలో ఒక.స్థానం, స్థానిక ఎన్నికల్లో కానరాని పట్టు… ఇలాంటి స్థితిలో భాజపా దక్షిణాదిన బాగా’పుంజు’ కొంటుందని ఆశించటం అత్యాశే. బట్‌.. ప్రయత్న లోపం లేకుండా భాజపా ముందుకు సాగటం ఈ తరుణంలో ఆ పార్టీకి మంచి ముందడుగు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close