అలోక్ వర్మ రాజీనామా

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సిబిఐ వ్యవహారం మలుపులు తిరిగి తాత్కాలికంగా ఆగింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం తీర్పుతో తిరిగి సిబిఐ డైరెక్టర్‌ పదవి చేపట్టిన అలోక్‌ వర్మను ప్రభుత్వం ఒక్కరోజులోనే బదిలీ చేసింది. ఈ దశలో ఆయనను అగ్నిమాపక శాఖకు బదిలీ చేశారు. మరోవైపు ఫైర్‌సర్వీసెస్‌ డీజీగా బాధ్యతలు చేపట్టడానికి సీబీఐ మాజీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ నిరాకరించారు. సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌గా మళ్లీ నాగేశ్వర రావును నియమించారు. దీంతో మనస్థాపానికి గురైన అలోక్‌ వర్మ బదిలీ జరిగిన చోటుకు వెళ్లకుండానే రాజీనామా చేశారు. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన వుక్రవరాం ప్రకటించారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో బుధవారం మరోసారి సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌ను మళ్లీ తప్పిస్తూ కేంద్రం గురువారం సాయంత్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయనను ఫైర్‌ సర్వీసెస్‌ డీజీగా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన అగ్నిమాపక, డీజీ బాధ్యతలు చేపట్టకుండానే ఉద్యోగానికి రాజీనామా చేశారు.

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావు శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాజీ సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ చేసిన బదిలీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలోక్‌, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా మధ్య విభేదాలు ముదరడంతో వారిద్దరినీ నిర్బంధ సెలవుపై పంపిస్తూ గతేడాది అక్టోబరు 23న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆలోక్‌ సుప్రీంను ఆశ్రయించారు. విచారణ నిర్వహించిన న్యాయస్థానం సీబీఐ డైరెక్టర్‌గా ఆయనకు తిరిగి పగ్గాలు అప్పగిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో 77రోజుల నిర్బంధ సెలవు తర్వాత ఆలోక్‌ బుధవారం తిరిగి విధుల్లో చేరారు. తాను వెళ్లిపోయాక సీబీఐలో చోటుచేసుకున్న బదిలీలను రద్దు చేశారు. ఆలోక్‌ను తొలగించడానికి కొన్ని గంటల ముందు ఆయన ఐదుగురు సీబీఐ ఉన్నతాధికారులను బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాపై నమోదైన అవినీతి కేసు దర్యాప్తు అధికారి(ఐవో)గా ఎస్పీ ¬దాలోని మోహిత్‌ గుప్తాను ఆలోక్‌ నియమించారు. అస్థానా కేసును విచారిస్తున్న డీఎస్పీ ఎ.కె.బస్సి, అదనపు ఎస్పీ ఎస్‌.ఎస్‌.గుర్మ ఐవోలుగా ఉండగా వారి స్థానంలో సతీశ్‌ దాగర్‌ నియమితులయ్యారు. సతీశ్‌ను తప్పించి గుప్తాకు ఆలోక్‌ బాధ్యతలు అప్పగించారు. వారందరి బదిలీలను తాత్కాలిక సీబీఐ డైరెక్టర్‌ నాగేశ్వరరావు రద్దు చేశారు. గతంలో ఉన్న స్థానాల్లోనే వాళ్లను కొనసాగాల్సిందిగా సూచించారు. మొత్తంగా ఈ వ్యవహారంలో ఇక చేసేదేవిూ లేక అలోక్‌ వర్మ రాజీనామా చేశారు. ఆయన తన భవిష్యత్‌ ఏమిటన్నది నిర్ణయించుకో బోతున్నారు. ఈ నెలాఖరుకు వర్మ పదవీవిరమణ చేయబోతున్నారు. 20 రోజుల ముంద ఉగానే ఆయన తన పదవి నుంచి తప్పుకున్నట్లు అయ్యింది. రాకేశ్‌ ఆస్థానాకు కోర్టులో చుక్కెదురు సీబీఐ నంబర్‌ 2 రాకేష్‌ ఆస్థానాకు ఎదురు దెబ్బ తగిలింది. లంచం కేసులో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.అంతేకాదు ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలపై విచారణ జరపాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ నజ్మి వజీరి.. స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్థానా, డిప్యూటీ సూపరింటెండెంట్‌ దేవేందర్‌ కుమార్‌లపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయడానికి నిరాకరించారు. కోర్టు ఆదేశాలతో ఇప్పుడు రాకేష్‌ ఆస్థానాను అరెస్ట్‌ చేసే అవకాశం కూడా ఉంది. అరెస్ట్‌ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించడానికి కూడా కోర్టు నిరాకరించింది. అయితే రెండు వారాల పాటు ఇప్పుడున్న పరిస్థితినే కొనసాగించాలని సీబీఐకి ఆదేశించింది. పది వారాల్లో రాకేష్‌ ఆస్థానాపై విచారణను పూర్తి చేయాలని కూడా స్పష్టం చేసింది. ఆయనపై నేరపూరిత కుట్ర, అవినీతి, నేరపూరిత దుష్పవ్రర్తన కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

సీబీఐ స్వతంత్రతను కాపాడాలి : అలోక్‌ వర్మ

తనపై నిరాధారమైన, నిష్పయ్రోజనమైన, తప్పుడు ఆరోపణలు చేసి పదవి నుంచి తొలగించారని సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా కేవలం ఒక్క వ్యక్తి చేసిన ఆరోపణలతో తనను బదిలీ చేశారని అన్నారు. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐని నాశనం చేయడానికి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్‌డిఎప్రభుత్వం ప్రయత్నిస్తోందని సిబిఐ డైరెక్టర్‌ పదవి నుంచి ఉద్వాసనకు గురైన అలోక్‌ వర్మ ఆరోపించారు. తనను సిబిఐ డైరెక్టర్‌ పదవి నుంచి అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేయడంపై స్పందించిన వర్మ తన పట్ల శత్రుత్వాన్ని పెంచుకున్న ఒకే ఒక వ్యక్తి చేసిన తప్పుడు, నిరాధార, దురుద్దేశపూరిత ఆరోపణల ఆధారంగానే తనను బదిలీ చేశారని ఆరోపించారు.ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఆలోక్‌ వర్మను అగ్నిమాపక, సివిల్‌ డిఫెన్స్‌, ¬ం గార్డ్స్‌ విభాగం డీజీగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆలోక్‌ వర్మకు తిరిగి సీబీఐ బాధ్యతలు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన కేవలం రెండు రోజుల్లోనే ఆయనను అక్కడి నుంచి బదిలీ చేసి ఆ స్థానంలో మళ్లీ తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావును నియమించారు.కాగా ఈ విషయంపై ఆలోక్‌ వర్మ మాట్లాడుతూ.. అవినీతి కేసులపై దర్యాప్తు జరిపే సీబీఐ స్వతంత్రతను తప్పనిసరిగా కాపాడాలని కోరారు. తాను సంస్థ సమగ్రతను కాపాడేందుకు ప్రయత్నించానని చెప్పారు. కానీ న్యాయపరమైన సమ్మతి లేకుండా అక్టోబరు 23న కేంద్రం, సీవీసీ తనపై ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలతో తనను కమిటీ బదిలీ చేయడం చాలా విచారకరమని అన్నారు. అయితే ఈవిషయంపై స్పందించిన ప్రభుత్వ వర్గాలు సీవీసీ నివేదిక ఆధారంగానే బదిలి చేయడం జరిగిందన్నారు. సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్‌ వర్మ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాటైన కమిటీ.. అవినీతి, విధుల పట్ల అలసత్వం వంటి ఆరోపణలు ఉన్నట్లు కేంద్ర నిఘా కమిషన్‌(సీవీసీ) సమర్పించిన నివేదిక ఆధారంగానే ఆయనను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. తన బదిలీ నిర్ణయంపై పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ప్రకటనలో వర్మ స్పందించారు. సిబిఐ స్వతంత్రతను పరిరక్షించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. బయటి నుంచి ఒత్తిళ్లు లేకుండా సిబిఐ పనిచేయాలి. సిబిఐని నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ దాని సమగ్రతను కాపాడేందుకు నేను ప్రయత్నించాను. తమ పరిధిలో లేనప్పటికీ కేంద్ర ప్రభుత్వం, సివిసి గత ఏడాది అక్టోబర్‌ 23న జారీచేసిన ఉత్తర్వులు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. వీటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది అని వర్మ తెలిపారు. సిబిఐ డైరెక్టర్‌గా అలోక్‌ వర్మ పదవీ కాలం జనవరి 31తో ముగియనున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here