ఉద్యోగం ఊడిన ఆలోక్ వర్మ

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సీబీఐ చీఫ్‌ అలోక్‌ వర్మను ఆ పదవి నుంచి తొలగిస్తూ సెలక్షన్‌ ప్యానెల్‌ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు 12 మంది సీబీఐ అధికారులను బదిలీ చేశారు. 24 గంటల్లో రెండుసార్లు సమావేశమైన హైపవర్డ్‌ కమిటీ గురువారం అలోక్‌ వర్మను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏ కే సిక్రి, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. సీబీఐ చీఫ్‌

విషయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. అలోక్‌ వర్మపై ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్లు హైపవర్డ్‌ కమిటీ గుర్తించినట్లు తెలుస్తోంది. అలోక్‌ వర్మను సీబీఐ చీఫ్‌ పదవి నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ, జస్టిస్‌ సిక్రి సమర్థించగా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించినట్లు సమాచారం.

వచ్చిరాగానే చెలరేగిపోయి… సీబీఐ డైరెక్టర్‌గా బుధవారం తిరిగి నియమితులైన అలోక్‌వర్మ ఇవాళ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. జేడీ అజయ్‌ భట్నాగర్‌ సహా మొత్తం ఐదుగురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. తాజాగా బదిలీ అయిన వారిలో డీఐజీ ఎంకే సిన్హా, డీఐజీ తరుణ్‌ గౌబా, జేడీ మురుగేశన్‌, ఏడీ ఏకే శర్మ తదితరులు ఉన్నారు. పరిపాలనా విభాగం డిప్యూడీ డైరెక్టర్‌ అనీశ్‌ ప్రసాద్‌ యథావిధిగా తన స్థానంలోనే ఉండగా… నిఘా విభాగాన్ని పర్యవేక్షించే యూనిట్‌ 1 బాధ్యతలను కేఆర్‌ చౌరాసియాకి అప్పగించారు. కాగా తాను సెలవులో ఉన్న సమయంలో తాత్కాలిక డైరెక్టర్‌ ఎం.నాగేశ్వర్‌రావు చేపట్టిన బదిలీలను వర్మ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలోక్‌ వర్మను విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని కొట్టేస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్థానా పరస్పరం తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో… కేంద్ర ప్రభుత్వం ఇద్దరినీ విధుల్లోంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here