Featuredజాతీయ వార్తలు

కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు

ఊహించినట్లుగానే అమిత్‌షాకు ¬ంశాఖ అప్పగింత

రక్షణశాఖను రాజ్‌నాథ్‌కు కేటాయింపు

అనూహ్యంగా నిర్మలకు ప్రమోషన్‌..ఆర్థిక శాఖ కేటాయింపు

విదేశాగ నిపుణుడు జయశంకర్‌కు విదేశీ వ్యవహారాలు అప్పగింత

ప్రకాశ్‌ జవదేకర్‌కు సమాచార శాఖ

అరవింద్‌ గణపత్‌ సావంత్‌కు భారీ పరిశ్రమల శాఖ

న్యూఢిల్లీ, నరేంద్రమోదీ కేబినెట్‌లో మంత్రులకు శాఖలు కేటాయించారు. అందరూ ఊహించినట్లుగానే అమిత్‌షాకు కేంద్ర¬ంశాఖ దక్కింది. ఆయన మంత్రివర్గంలో చేరగానే నెంబర్‌ టూగా ఉంటారన్న ప్రచారంతో పాటు, ¬శాఖ దక్కుతుందని అంతా భావించారు. అలాగే ఆ పదవి ఇప్పుడు ఆయనకు దక్కింది. ఇకపోతే అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను నిర్మలా సీతరామన్‌కు కట్టబెట్టారు. గత ప్రభుత్వంలో కీలకమైన రక్షణశాఖను అప్పగించిన ప్రధాని మోడీ ఇప్పుడు అంతకుమించి ఆర్థికశాఖను కట్టబెట్టారు. గతంలో అరుణ్‌జైట్లీ ఆర్థికశాఖను నిర్వహించారు. ఇదో రకంగా ఆమెకు ప్రమోషన్‌గాచూడాలి. గత మంత్రి వర్గంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖ అప్పగించడంతో ఆమె బాధ్యత మరింతపెరిగింది. త్వరలోనే బడ్జెట్‌ రూపొందించే క్రమంలో ఆమెకు కీలకమైన ఆర్థఙక శాఖను అప్పగించడం విశేషం. గురువారం రాత్రి 57 మందితో కొత్త కేబినెట్‌ కొలువుదీరింది. ఇందులో 24 మందికి కేబినెట్‌, 9 మందికి స్వతంత్ర ¬దా, 24 మందికి సహాయ మంత్రుల ¬దా కల్పించారు. ఈదఫా మంత్రివర్గంలో 20 మంది కొత్తవారికి అవకాశం లభించింది. ఇకపోతే గత కేబినేట్‌లో ¬ంశౄఖ మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్‌సింగ్‌కు ఈ దఫా రక్షణశాఖను అప్పగించారు. ఇది కూడా అత్యంత ప్రభావవంతమైన శాఖగానే చూడాలి. గతంలో జస్వంత్‌ సింగ్‌ దీనిని నిర్వహించారు. ఇకపోతే అందరూ ఊహింనట్లుగానే విదేశాంగ నిపుణుడు జయశంకర్‌కు విదేశీ వ్యవహారాల శాఖను అప్పగించారు. గత కేబినేట్‌లో సుష్మస్వరాజ్‌ దీనిని నిర్వహించారు. విదేశాంగశాఖకు ఆమె వన్నె తెచ్చారు. మరో సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌కు గతంలో నిర్వహించిన న్యాయ, సమాచార, ఐటీ శాఖలను కేటాయించారు. సదానందగౌడకు రసాయన, ఎరువుల శాఖ, రామ్‌విలాస్‌ పాసవాన్‌కు వినియోగ దారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు, నితిన్‌ గడ్కరీకి రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమలు,నరేంద్రసింగ్‌ తోమర్‌/-కు వ్యవసాయం, రైతుల సంక్షేం, గ్రావిూణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌, హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌కు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ, థావర్‌ చంద్‌ గ¬్లత్‌కు సామాజిక న్యాయం, సాధికారత శాఖలను అప్పగించారు. గతంలో ప్రకాశ్‌ జవదేకర్‌ నిర్వహించిన మానవ వనరుల అభివృద్ధిశాఖను రమేశ్‌ పొఖ్రియాల్‌కు అప్పగించారు. అర్జున్‌ ముందాకు గిరిజన సంక్షేమం, స్మృతి ఇరానీకి స్త్రీ, శిశు సంక్షేమం, జౌళి శాఖ అప్పగించారు. ఆమె శాఖ విషయంలో కూడా పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. ఇకపోతే హర్షవర్ధన్‌ గతంలో నిర్వహించిన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం అప్పగించారు. ప్రకాశ్‌ జావడేకర్‌కు పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖలను అప్పగించారు. పీయూష్‌ గోయల్‌/-కు రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖలను, ధర్మేంద్ర ప్రదాన్‌కు పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖలు, ప్రహ్లాద్‌ జోషీకి పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులశాఖ మహేంద్రనాథ్‌ పాండేకు నైపుణ్యాభివృద్ధి శాఖను, అరవింద్‌ గణపత్‌ సావంత్‌కు భారీ పరిశ్రమల శాఖను అప్పగించారు. గిరిరాజ్‌ సింగ్‌/-కు పాడి,

పశుగణాభివృద్ధి, పిషరీస్‌,ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి మైనార్టీ సంక్షేమశాఖ శాఖలు కేటాయించారు. ఫిజిక్స్‌ మాజీ ప్రొఫెసర్‌ అయిన రాజ్‌ నాథ్‌.. 2009-13, 2013-14 మధ్య పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. సీనియర్‌ నాయకులు ఎల్‌కే అద్వానీ వంటి నేతలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ .. 2014లో మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంలో రాజ్‌నాథ్‌ కీలకంగా వ్యవహరించారు. పార్టీలో జీవిత కాల సభ్యుడైన ఆయన ఆ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2000-2002 మధ్య ఉత్తరప్రదేశ్‌ సీఎంగా పనిచేశారు. వాజపేయి ప్రభుత్వంలో ఉపరితల రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి మూడుసార్లు, రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. 2009లో తొలిసారి ఘజియాబాద్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014, 19లో లక్నో నుంచి వరుసగా గెలుపొందారు.

స్వతంత్ర ¬దా కలిగిన కేంద్ర మంత్రులు

సంతోష్‌ కుమార్‌ గాంగ్వర్‌ – శ్రామిక, ఉపాధి కల్పన శాఖ

ఇంద్రజిత్‌ సింగ్‌ – ప్రణాళిక, గణాంక శాఖ

శ్రీపాద యశో నాయక్‌ – ఆయుష్‌, డిఫెన్స్‌ శాఖ సహాయమంత్రి

జితేంద్ర సింగ్‌ – సిబ్బంది వ్యవహారాలు, అణు ఇంధన శాఖ, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు, పీఎంవో సహాయ మంత్రి

కిరణ్‌ రిజిజు – క్రీడలు, యుజవన, మైనార్టీ వ్యవహారాలు

ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ – సాంస్కృతిక పర్యాటక శాఖ

రాజ్‌ కుమార్‌ సింగ్‌ – విద్యుత్‌, సంప్రదాయేతర విద్యుత్‌, నైపుణ్యాభివృద్ధి

హర్దీప్‌ సింగ్‌ పూరి – గృహ నిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ

మన్‌ సుఖ్‌ మాండవ్య – షిప్పింగ్‌, రసాయనాలు, ఎరువులు

సహాయ మంత్రులు

జగన్‌ సింగ్‌ కులస్తే – ఉక్కు శాఖ సహాయ మంత్రి

అశ్వినీ కుమార్‌ చౌబే – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి

అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ – పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు సహాయమంత్రి

జనరల్‌ వీకే సింగ్‌ – రహదారులు, రవాణా శాఖ సహాయ మంత్రి

కిషన్‌ పాల్‌ – సాంఘిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి

/ూవు సాహెబ్‌ దాన్వే – వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ సహాయ మంత్రి

కిషన్‌ రెడ్డి – ¬ంశాక సహాయ మంత్రి

పురుషోత్తమ్‌ రూపాలా – వ్యవసాయం, రైతు సంక్షేమం సహాయ మంత్రి

రాందాస్‌ అథవాలే – సాంఘిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి

సాధ్వి నిరంజన్‌ జ్యోతి – గ్రావిూణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి

బాబులు సుప్రియో – అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి

సంజీవ్‌ కుమార్‌ బల్యాన్‌ – పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్‌ సహాయ మంత్రి

గోత్రే సంజయ్‌ శ్యామ్‌ రావు – మానవ వనరుల అభివృద్ధి, కమ్యూనికేషన్‌ సహాయ మంత్రి

అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ – ఆర్థిక శాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయమంత్రి

సురేశ్‌ చిన బసప్ప – రైల్వే శాఖ సహాయ మంత్రి

నిత్యానంద్‌ రాయ్‌ – ¬ంశాఖ సహాయ మంత్రి

రతన్‌ లాల్‌ కఠారియా – జలవనరులు, సాంఘిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి

వి, మురళీధరన్‌ – విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి

రేణుకా సింగ్‌ సరూత – గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి

సోమ్‌ ప్రకాశ్‌ – పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రి

రామేశ్వర్‌ తేలి – ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ శాఖ సహాయ మంత్రి

ప్రతాప్‌ చంద్ర సారంగి – సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఫిషరీస్‌ శాఖ సహాయ మంత్రి

కైలాస్‌ చౌదరి – వ్యవసాయం, రైతు సంక్షేమం సహాయ మంత్రి

తేబోశ్రీ చౌదరి – మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close