ఇంతింతై వటుడింతై..

0
  • అలా.. అలా ఎదిగి..!
  • అద్వానీ కోసం ప్రచారం.. ఆయన సీటునే..!
  • మోడీకి ఆల్‌ ఇన్‌ వన్‌ షానే..!

గుజరాత్‌లో నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా ఉన్న ¬ంమంత్రిగా పని చేసిన అమిత్‌ షా .. ఇప్పుడు కేంద్రంలో మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు.. అదే ¬ంశాఖను చేపట్టబోతున్నారు. అమిత్‌ షా దశ తిరిగింది. అంచెలంచెలుగా బీజేపీలో ఎదుగుతూ ఇప్పుడు పార్టీలోనే నెంబర్‌ టూ స్థానానికి చేరుకున్నారు. పార్టీని ఇప్పటి వరకు కనుసైగలతో నడిపిన అమిత్‌ షా.. ఇప్పుడు ప్రభుత్వంలోనూ పవర్‌ సెంటర్‌ గా మారారు.. కేంద్ర ప్రభుత్వంలో నెంబర్‌ టూగా ఇప్పటికే విపరీతమైన ప్రచారం పొందుతున్న అమిత్‌ షాకు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. అత్యంత కీలకమైన ¬ంమంత్రిత్వ శాఖను కట్టబెట్టారు. సాధారణంగా ¬ంశాఖ నిర్వహించేవారే కేంద్రంలో ప్రధానమంత్రి తర్వాతి స్థానంలో ఉంటారు. ఇలా.. శాఖల పరంగానూ.. అమిత్‌ షాకు నరేంద్రమోడీ అత్యంత ప్రాధాన్యత కల్పించారు. ఆయనకు సహాయమంత్రిగా? తెలంగాణకు చెందిన సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌ రెడ్డికి చాన్సిచ్చారు. కేబినెట్‌ దక్కుతుందని అనుకున్న కిషన్‌ రెడ్డికి సహాయమంత్రి పదవి మాత్రమే లభించింది. అది కూడా.. కీలకమైన ¬ంశాఖ.. లభించడంతో కాస్త ప్రాధాన్యత దక్కిందనే భావన.. వ్యక్తమవుతోంది .ఇక గత ప్రభుత్వంలో ¬ంశాఖను చూసిన రాజ్‌నాథ్‌ సింగ్‌ కు రక్షణ మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఇది కీలకమైన శాఖగా ఉన్నప్పటికీ పెద్దగా పని ఉండదనే చెప్పుకోవాలి. తొలిసారి మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు ప్రధాని మోడీ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనకు ¬ం శాఖను కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పార్టీలో మోడీ తర్వాత నం.2గా ఉన్న అమిత్‌ షాను.. ఇప్పుడు ప్రభుత్వంలోనూ నం.2గా పట్టం కట్టారు. భవిష్యత్‌ వ్యూహంలో భాగంగానే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2024 నాటికి మోడీ 2.0 పరిపాలన పూర్తవుతుంది. మోడీకి అప్పటికి 73 ఏళ్లు నిండుతాయి. పార్టీలో ఆయన ఓ సంప్రదాయం నెలకొల్పారు. దీని ప్రకారం 75 ఏళ్లు నిండిన నాయకులు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలి. లోక్‌సభ ఎన్నికల్లో వారు పోటీకి అనర్హులు. ఎల్‌.కె. అద్వాణీ, మురళీ మనోహర్‌జోషి, సుమిత్రా మహాజన్‌ లాంటి దిగ్గజాలను ఇదే నియమం ఆధారంగా పక్కన పెట్టారు. దీని ప్రకారం.. 2024లో మోడీ కూడా పక్కకు తప్పుకోవాల్సిందే.

అమిత్‌ షా అలా.. అలా ఎదిగిపోయారు?!

ప్రధాని మోడీ కి అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. బీజేపీ నిర్మాతల్లో ఒకరైన లాల్‌ కృష్ణ అద్వానీని వయసు కారణాలపై పోటీ నుంచి తప్పించినపుడు ఆయన సొంత నియోజకవర్గం గాంధీనగర్‌ నుంచి ఎవరు పోటీచేస్తారని విూడియాలో ఊహాగానాలు సాగాయి. ఒకప్పుడు అద్వానీకి పోల్‌ మేనేజర్‌గా పనిచేసిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రంగంలోకి దిగుతారని ఎవరూ ఊహించలేదు. కారణం.. షా అప్పటికే రాజ్యసభ సభ్యుడు, పార్టీ అధినేతగా కీలక బాధ్యతల్లో ఉన్నవారు. కానీ, ఆయనను ప్రత్యక్ష పోటీకి దింపినపుడే మోడీ తదుపరి కేబినెట్లో బెర్తు ఖాయమని తేలిపోయింది. ఊహించినట్లే షా 5,57,014 ఓట్ల భారీ మెజారిటీ కాంగ్రెస్‌ ప్రత్యర్థిని ఓడించారు. అమిత్‌ షా మోడీకి అత్యంత ఆంతరంగికుడు. ఏ విషయమైనా వారిద్దరూ చర్చించుకొన్నాకే బయటపెడతారు.

అద్వానీ కోసం ప్రచారం చేసి.. అద్వానీ సీట్లో గెలిచి..!

మొదటిసారి షా మోడీని 1982లో కలిశారు. షా 1991 ఎన్నికల్లో అద్వానీకి ప్రచార నిర్వహణాధికారిగా పనిచేశారు.1990లో మోడీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1997లో షా తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత మరో మూడు సార్లు గెలిచారు. 2001లో మోడీని ముఖ్యమంత్రి చేశాక షా దశ తిరిగిపోయింది. మోడీ మంత్రివర్గంలో ¬ంశాఖతో పాటు 12శాఖలు నిర్వహించారు. మోడీ ప్రధాని అయ్యాక అమిత్‌ షా కేంద్ర రాజకీయాల్లో కీలకమయ్యారు. తొలిసారి కేబినెట్లో చేరకుండా- బీజేపీ అధ్యక్షుడయ్యారు. ఒకటొకటిగా అనేక రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించి దేశం మొత్తాన్ని కాషాయమయం చేయడంలో విశేష కృషి చేశారు. ఇపుడు ఆయన మోడీ కేబినెట్లో చేరారు. పార్టీ సారథ్యం నుంచి పాలన వ్యవహారాల్లోకి అడుగుపెట్టారు. కేబినెట్‌లో నెంబర్‌ టూ అయ్యారు.

మోడీకి ఆల్‌ ఇన్‌ వన్‌ షానే..!

మోడీతో అమిత్‌ షా బంధం ఈనాటిది కాదు.. ఇంకా చెప్పాలంటే గుజరాత్‌ నుంచి పెనవేసుకుపోయిన ఫెవికాల్‌ బంధం.. అందుకే అమిత్‌ షాపై మోడీకి గురి ఎక్కువ.. 2014లో గెలవగానే.. అమిత్‌ షాకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి బీజేపీ స్వరూపమే మారిపోయింది. దేశం నలుమూలలా కాషాయన్ని విస్తరింపజేయడంలో అమిత్‌ షా సూపర్‌ సక్సెస్‌ అయ్యారు. చివరికి బీజేపీ కాలు పెట్టలేదు అనే చోట కూడా కమలాన్ని కింగ్‌ మేకర్‌గా నిలిపారు. రెండు సీట్లకే పరిమితమైన రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి తెచ్చారు. అమిత్‌ షా వ్యూహాలు, దూకుడు, మోడీతో సాన్నిహిత్యం.. పార్టీకి-ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉంటూ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అమిత్‌ షా ముందుకు వెళ్ళారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here